రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథని సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అలానే హీరోలు ఇద్దరి ఫస్ట్ లుక్ టీజర్లకు ప్రేక్షకులు అలానే అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మనదేశ ప్రేక్షకులతో పాటు పలు ఇతర దేశాల్లో ఉన్న ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిలిమ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజులుగా మూవీ యూనిట్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే దీని వెనక ఒక మతలబు ఉందని మరొక నెలన్నర తర్వాత అనగా జనవరి ఒకటో తేదీ నుంచి ఈ సినిమా యొక్క అప్డేట్స్ ఒక్కొక్కటిగా మొదలవుతాయని అక్కడినుండి ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ సహా సినిమాలోని పలు ఇతర పాత్రల పరిచయం కూడా వరుసగా  ఉంటుందని కాగా సినిమాని వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్త నిజమే అయితే ఇది మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ గొప్ప పండుగ న్యూస్ అని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: