ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...హాట్ బ్యూటీ కృతి కర్బంద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన తీన్‌మార్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. తీన్మార్ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలో పవర్ స్టార్ తో నటించిన గుర్తింపుతో మెల్లగా అవకాశాలు దక్కించుకుంది.ఎనర్జిటిక్ హీరోయిన్ రామ్ తో ఒంగోలు గిత్త లో హీరోయిన్ గా నటించింది. కాని ఆ సినిమా ప్లాప్ అవ్వటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి ఈ ముద్దు గుమ్మకి. ఇక చేసేది లేక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా బ్రూస్‌లీలో అక్క పాత్ర పోషించింది ... ఇక  టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది.అక్కడ ఈమె అదృష్టం బాగుండి బాగానే అవకాశాలు దక్కించుకుంటుంది. చాలా సినిమాలు చేస్తుంది..


అక్కడ ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బాలీవుడ్‌ నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమలో పడినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలొచ్చాయి.ఈ న్యూస్‌పై స్పందించిన కృతి ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ‘పులకిత్ చాలా మంచి వ్యక్తి అని, ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఏడాదిన్నరగా డేటింగ్ చేస్తున్నాం. అయితే ఇద్దరి ఫోకస్ ఇప్పుడు కెరీర్ మీదే ఉంది.


అందువల్ల ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం’ అని కృతి చెప్పుకొచ్చింది. కృతి, పులకిత్ ఇద్ద‌రు క‌లిసి ‘పాగ‌ల్ పంథీ’ చిత్రంలో క‌లిసి నటించారు.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: