ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగాహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. మాములుగా మెగా ఫ్యామిలీ అంటేనే ఊర మాస్ కి పెట్టింది పేరు. కాని ఈ హీరో అటు మాస్ తో పాటు క్లాస్ సినిమాలను కూడా సమానంగా కవర్ చేస్తాడు. రెగ్యులర్ కమర్షియల్ హీరోల కాకుండా సరికొత్త కథలను ఎన్నుకొని కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ  ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ లో ప్రస్తుతం అందరి హీరోల కంటే ఈ హీరోకే  సక్సెస్ రేట్ చాలా బాగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే....వరుణ్ కెరీర్ లో "ఎఫ్ 2" సినిమా బిగ్గెస్ట్ హిట్ అని తెలుసు.అనిల్ రావిపూడితో తీసిన  ‘ఎఫ్ 2’ సినిమా ఒప్పుకున్న సమయంలో వరుణ్ తేజ్ కి మంచి మంచి  హిట్ సినిమాలు వున్నాయి. అయినా కాని  వెంకటేష్ లాంటి హీరోతో కలిసి నటించడానికి  ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.


రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయకుండా దిల్ రాజు ఇస్తానని చెప్పిన మొత్తాన్నే తీసుకున్నాడు. పాత్ర పరంగా కూడా ఎలాంటి డిమాండ్లు వరుణ్ చేయలేదట.కానీ ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న సినిమా విషయంలో మాత్రం వరుణ్ పారితోషికం విషయంలో ఎంత మాత్రం తగ్గే ఛాన్స్  లేదంటున్నాడట. తన పారితోషికం  పెంచి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడట. అలానే పాత్ర పరంగా కూడా తనకు సమాన ప్రాధాన్యం ఉండాలని చెప్పాడట. వరుణ్ తేజ్ ఇప్పుడిలా పట్టుబట్టడం వలన దిల్ రాజు దీనిని ఎలాగోలా తెగ్గొట్టాలని చూస్తున్నాడట. ‘ఎఫ్2’ సినిమాకి దిల్ రాజు రూ.30 కోట్లకు పైగా లాభాలు పొందాడు.సీక్వెల్ అంటే ఖచ్చితంగా క్రేజ్ భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి  ఈసారి వరుణ్ అయినా.. వెంకటేష్ అయినా తక్కువకు సర్దుకుపోయే ఛాన్స్ అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది.


ఇక పోతే సూపర్ స్టార్ మహేష్ తో "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో అనిల్ రావిపూడి కూడా  స్టార్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి అతడు కూడా పారితోషికం విషయంలో రాజీ పడడు. ‘ఎఫ్2’ సినిమాను దిల్ రాజు ముప్పై కోట్ల లోపే పూర్తి చేశాడు. కానీ సీక్వెల్ కి మాత్రం కనీసం యాభై కోట్లకు మించి ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ని  కారణంగా అడ్డు పెట్టుకొని  బడ్జెట్ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్ రాజుకి ఈ సినిమా విషయంలో రాయితీలు వచ్చేలా లేవని స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో మూవీ విశేషాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: