టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరగుతోంది. `మన్మథుడు-2` తర్వాత ఆయన కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ విజయ్ వర్మగా కనిపిస్తారు.

ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే బోర్డర్‌కు సమీపంలోని రోహతంగ్ పాస్‌లో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా మూత పడిన సినిమా హాళ్లు తెరిస్తే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించారు. బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమా చూడాలని నాగ్ అభిమానులు కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు వారందరికీ ఓ షాకింగ్ వార్త తెలిసింది. అదేంటంటే.. `వైల్డ్ డాగ్` నిర్మాతలు ఈ చిత్రాన్ని సినిమా హాళ్లలో రిలీజ్ చేయడానికి సుముఖంగా లేరట. సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికే మొగ్గు చూపుతున్నారట.

ఈ మేరకు సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ తొలగించడంతో థియేటర్లు తెరిచినా.. ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా? లేదా? అన్నది పెద్ద సమస్యగా మారింది. కరోనా భయంతో ప్రేక్షకులు రాకపోతే సినిమాలు విడుదల చేసినా ఉపయోగం ఉండదు. ఈ కారణంగానే ఈ ఏడాది థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదట. అదే సమయంలో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే.. ఇప్పటికే సంక్రాంతి విడుదల కోసం భారీ చిత్రాలు వరుసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో `వైల్డ్ డాగ్` నిర్మాతలు తమ సినిమాను థియేటర్లతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: