బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం నామినేషన్స్ లో నలుగురు కంటెస్టంట్స్ ఉన్నారు. అఖిల్, మోనాల్, అవినాష్, అరియానా ఈ నలుగురులో ఒకరు ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్తారని తెలుస్తుంది. అయితే తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల అవినాష్ హౌజ్ నుండి బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. ఇక ఎటొచ్చి మోనాల్, అఖిల్, అరియానాలలో ఒకరు ఈవారం ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. అరియానా స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉండగా అఖిల్ గత రెండు వారాలుగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో పాటుగా మోనాల్ కు హారిక, అభిజిత్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం హౌజ్ లోంచి అఖిల్ వెళ్తాడని అంటున్నారు.

అయితే అఖిల్ కన్నా మోనాల్ ఎలా చూసినా స్ట్రాంగ్ కాదు. అందుకే ఈ వారం మోనాల్ కూడా వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే అఖిల్, మోనాల్ ఇద్దరు సేఫ్ అయితే మాత్రం అరియానా బిగ్ బాస్ హౌజ్ కు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఇదిలాఉంటే ఈ వారం హౌజ్ లోకి ఒక హౌజ్ మేట్ రీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే అలాంటిది ఏమి ఉండదు కాని ఈ వారం ఎలిమినేషన్ లేకుండా చేస్తారని మాత్రం తెలుస్తుంది.

సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవినాష్ ను వాడుకునేలా చేసి ఈ వారం హౌజ్ నుండి ఎవరిని ఎలిమినేట్ చేయరని టాక్. అదే జరిగితే మాత్రం మోనాల్, అఖిల్, అరియానా అందరు సేఫ్ అయినట్టే. అయితే నెక్స్ట్ వీక్ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. ఎవరు బయటకు వెళ్లినా మిగిలిన వారు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: