3 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం నాలుగవ సీజన్ నడిపిస్తుంది. అయితే షోలో ఎవరు ఎంత బాగా ఆడిన అసలు ఆట ఆడేది మాత్రం బయట ఆడియెన్సే. లోపల హౌజ్ మేట్స్ ను ఉంచాలా లేక ఎలిమినేట్ చేయాలా అన్నది వారి ఇష్టమే. కేవలం ఆడియెన్స్ ఓటింగ్ ను బట్టే నామినేషన్స్ లో ఉన్న కంటెస్టంట్స్ ను ఇంటికి పంపించేస్తారు. అయితే బిగ్ బాస్ హౌజ్ కేవలం కొందరి చేతుల్లోకి వెళ్తుంది అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ బిగ్ బాస్ కు వెళ్లే ఛాన్స్ ఉందని సెలెక్టెడ్ కంటెస్టంట్స్ తమ టీం కు చెప్పి వారితో సోషల్ మీడియాలో ప్రమోట్ చేయించడం జరుగుతుంది.

మొదటి సీజన్ అంతగా ఈ సోషల్ మీడియా ప్రభావం లేకపోయినా సెకండ్ సీజన్ లో ఆర్మీలంటూ పెట్టేసి విన్నర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. అయితే సీజన్ 3 కూడ దాదాపు అలానే జరిగింది. ఇక ప్రస్తుతం సీజన్ 4 మరీ ముఖ్యంగా ఓ కంటెస్టంట్ కు బీభత్సమైన సోషల్ మీడియా సపోర్ట్ ఉంది. అతను టాస్కుల్లో పెద్దగా పర్ఫాం చేయకపోయినా.. మోర్నింగ్ వేకప్ డ్యాన్స్ చేయకపోయినా.. బిగ్ బాస్ ను ప్రమోట్ చేసే కొన్ని డ్రింక్స్ ఇచ్చే టాస్కులు చేయకపోయినా అతనే ప్రతిసారి నామినేషన్స్ లో ముందు సేఫ్ అవుతాడు.

అతనికి నామినేషన్స్ లో రావడం అంటే ఇష్టమని అంటాడు. మరి ఆ ధైర్యం ఏంటో అని కొందరు అంటున్నారు. అతనికి పెయిడ్ మీడియా ఏదైనా ఉందా దాని వల్లే అతను మొదట సేఫ్ అవుతున్నాడా.. అతనికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయా అన్న డౌట్ వస్తుంది. అదే నిజమైతే మాత్రం బిగ్ బాస్ షో పెయిడ్ మీడియా చేతుల్లోకి వెళ్లినట్టే అవుతుంది. అలా జరుగకుండా చూసుకునే బాధ్యత షో నిర్వాహకులకే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: