కన్నడ స్టార్ హీరో యశ్ అంతకుముందు ఎవరో తెలియదు కాని కె.జి.ఎఫ్ సినిమా తర్వాత అతనికి అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో కె.జి.ఎఫ్ సూపర్ హిట్ అవడంతో చాప్టర్ 2ని ఇక్కడ ఆడియెన్స్ అంచనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మొదటి పార్ట్ కు మించి ఉండేలా చూస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారు.

ఇక చాప్టర్ 2 రిలీజ్ తర్వాత యశ్ రేంజ్ వేరేలా ఉంటుంది. సినిమా పార్ట్ 1 లానే అంచనాలను అందుకుంటే మాత్రం యశ్ రేంజ్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నట్టే లెక్క. అందుకే కె.జి.ఎఫ్ చాప్టర్ 2ని ఏమాత్రం తగ్గకుండా అంచనాలకు తగినట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడ నుండో పార్ట్ 2 మొదలవుతుంది.

పార్ట్ 2 తర్వాత మరో కమర్షియల్ ఎంటర్టైనర్ తో యశ్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తప్పకుండా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మరోసారి యశ్ సత్తా చాటేలా చేస్తుందని అంటున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 250 కోట్ల దాకా వసూళు చేయగా ఇప్పుడు ఆ రేంజ్ బడ్జెట్ తో చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నారు.                                                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: