ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో రీమేక్  అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోకి తీసుకువచ్చే రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారు. దాదాపు ఈ ప్రయత్నాలు అన్నిసార్లు సఫలం అవుతూ వస్తున్నాయి. దీంతో మరింత మంది మరిన్ని సినిమాలను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఒక సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


పీకు అనే పేరుతో దీపికా పడుకోనే హీరోయిన్ గా సీనియర్ స్టార్ హీరో అమితాబచ్చన్ కీలక పాత్రలో ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఒక రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏకంగా బాక్సాఫీసు వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించి మంచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 


తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక బడా ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసిందట. ఈ సినిమాలో నటించమని నిర్మాతలు ఆమె అంగీకారం కూడా తెలిపినట్టు చెబుతున్నారు. ఇక తాజా సమాచారం మేరకు ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేగాక త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజున వెల్లడించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: