నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ కీర్తి సురేష్. మలయాళంలో ఒకప్పటి హీరోయిన్ మేనక అదే ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సురేష్ దంపతుల రెండో కుమార్తె కీర్తి సురేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. దానికి తోడు ఆమెకు మహానటి అనే సినిమా చేసే అవకాశం రావడంతో ఆ సినిమాలో ఆమె నటించకుండా జీవించింది. ఆ సినిమా దెబ్బకు ఆమెకు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా లభించింది. అయితే ఈ సినిమా చూసి అనుకుందో లేక ఏమనుకుందో కానీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ రావడం మొదలు పెట్టారు. 



అందులో భాగంగా ఆమె చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫారం ద్వారా రిలీజ్ అయ్యాయి. ముందుగా ఆమె చేసిన పెంగ్విన్ అనే సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన బడా స్టార్ చేసిన మొదటి సినిమా అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా అనుకున్నంత బాగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఈ పెంగ్విన్ సినిమా మా త్వరలోనే ఈ టీవీ లో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా హక్కులు కొనుక్కున్న జీ తెలుగు సంస్థ ఈ సినిమాను ఈనెల 29వ తారీఖున అంటే ఆదివారం రోజున టీవీలో వరల్డ్ ప్రీమియర్ చేయడానికి ప్లాన్ చేసింది. 



దీంతో ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించ లేకపోయినా ఈ సినిమా టీవీ ప్రేక్షకులను అయినా మెప్పించ కలుగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే థియేటర్ లో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ వినయ విధేయ రామ కూడా టీవీ లైవ్ టెలికాస్ట్ చేసిన ప్రతిసారి రికార్డు స్థాయి టి ఆర్ పి తెచ్చుకుంటూ ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఈ సినిమా కూడా అలా ఏమైనా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మళ్ళీ వార్తల్లో నిలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: