పవన్ కళ్యాణ్ మిగతా టాప్ హీరోలు లా తాను నటించే ప్రతి సినిమా పాత్ర విషయంలో వైవిద్యం కోసం తపన పడడు. అదేవిధంగా పవన్ తన పాత్రకు సంబంధించిన లుక్ బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడ పెద్దగా సినిమా సినిమాకు మార్పులు చేసుకోడు. అలాంటి పవన్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే మూవీలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.


సినిమాలలో ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం చేయడం చాలకష్టమైన పని. దాని గురించి ప్రత్యేకమైన ప్రిపరేషన్ కావాలి. రెండు పాత్రలకు సంబంధించి డిఫరెంట్ లుక్ మైంటైన్ చేస్తూ నటన పరంగా కూడ వేరియేషన్ చూపించాలి. అలాగే డైలాగ్ డెలివరీలో కూడ మార్పులు చేసుకోవాలి. చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన మూవీలు చాల సక్సస్ అయ్యాయి.


ఇప్పటి వరకు పవన్ కెరియర్ లో ఎప్పుడు ద్విపాత్రాభినయం చేయలేదు. గతంలో పవన్ నటించిన ‘తీన్ మార్’ మూవీలో డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు కాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను సపరేట్ గా డిజైన్ చేయడంతో వాస్తవానికి అది ద్విపాత్రాభినయం అనిపించుకోదు.  తెలుస్తున్న సమాచారంమేరకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో పవన్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ రెండు పాత్రలను హరీష్ శంకర్ చాల డిఫరెంట్ గా చూపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పై తీవ్ర అసహనంతో రగిలిపోయే యువకుడి పాత్రలో పవన్ కనిపిస్తే తండ్రి పాత్రలో పవన్ ముందు చూపుతో వ్యవహరించే ఒక మేధావిగా కనిపిస్తాడని టాక్. ఈ మూవీలో సాయి పల్లవి కూడ ఒక కీలక పాత్రలో నటించబోతోంది. పూర్తిగా వర్తమాన రాజకీయాల పై సెటైరికల్ మూవీగా తీయబడుతున్న ఈ మూవీ పవన్ ‘జనసేన’ సిద్ధాంతాలకు ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ 2022 సమ్మర్ రేస్ కు విడుదల అవ్వచ్చు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: