పవన్ కళ్యాణ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వస్తే చాలు అని చాలామంది ఆశపడతారు. అయితే దీనికి భిన్నంగా శృతి హాసన్ తీరు ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘వకీల్‍ సాబ్‍’ మూవీలో శృతి హాసన్ ఒక ప్రత్యెక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


ఈ మూవీకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‍ లో శృతి పాత్ర ఉంటుంది అని అంటున్నారు. పవన్ తో ఈమెకు ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలను  చిత్రీకరించా బోతున్నారు అని తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు పది రోజుల కాల్ షీట్స్ శృతి ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.


అయితే ఈ మూవీలో శృతి నటిస్తున్నది కేవలం ప్రత్యేక పాత్ర అయినప్పటికీ తనకు పారితోషికంగా ప్రస్తుతం ‘క్రాక్‍’ సినిమాలో ఎంత ఇచ్చారో అంతే ఇవ్వాలని శృతి హాసన్‍ డిమాండ్‍ చేసి నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాలకు సంబంధించి తక్కువ రోజుల వర్క్ వుండే టాప్  హీరోయిన్స్ కూడ తమ పారి తోషిక విషయంలో డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు.  



ఐటెమ్‍ సాంగ్‍ విషయంలో మాత్రం పారితోషికాన్ని  భారీగా డిమాండ్ చేస్తూ ఉంటారు.   అయితే దీనికి భిన్నంగా అతిథి పాత్ర చేసే విషయంలో శృతి హాసన్‍ ఫుల్‍ పేమెంట్‍  అడిగినట్లు వార్తలు వస్తూ ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఇప్పుడు శృతితో పేచీ పెట్టుకుని మరో హీరోయిన్‍ కోసం వెతకడం మొదలు పెడితే ఈ మూవీని పూర్తి చేయడం మరింత కష్టంగా మారుతుందని దిల్ రాజ్ శృతి డిమాండ్స్ కు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ మళ్ళీ రాజకీయాలలో బిజీగా మారిన పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ సెట్ లోకి పవన్ కళ్యాణ్ వచ్చేదాకా ఈ సినిమాకు సంబంధించిన ఇతర పెండింగ్ సీన్స్ ను తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత మాత్రమే పవన్ తిరిగి ‘వకీల్ సాబ్’ సెట్స్ పైకి వచ్చే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: