బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఇది 12వ వీకెండ్. దాంతో ఇంటెరెస్ట్ పెరుగుతోంది. హౌజ్ లో ఉన్నది ఏడుగురు. ఇందులో ఎవరు ఉంటారు ఎవరు బయటకు వెళ్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్ లో నలుగురు ఉన్నారు. అఖిల్, అవినష్, అరియానా, మోనాల్, మామూలుగా అయితే మోనాల్ ఎలిమినేట్ అవుతుందని చెప్పవచ్చు. కానీ ఇపుడు ఆమె గేమ్ ప్లాన్ పూర్తిగా  మార్చేసింది. మార్కులు కూడా బాగా పడుతున్నాయి.

దాంతో మోనాల్ గ్రాఫ్ ఒక్కసారిగా బయట పెరిగింది అంటున్నారు. ఇక అఖిల్ విషయానికి వస్తే స్ట్రాంగ్ కంటెస్టెంటే కానీ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. దాంతో కొంత టెన్షన్ ఉన్నా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల గట్టెక్కుతాడు అంటున్నారు. ఆరియానా బోల్డ్ టైప్. ఆ అమ్మడు తన ఫ్రాంక్ నెస్ తో మంచి మార్కులు ఎపుడూ సంపాదించుకుంటోంది. దాంతో ఆరియానా అసలు వెళ్లే చాన్సే లేదు.

ఇక చూసుకుంటే జబర్దస్త్ కమెడియన్ అవినాష్ వెళ్ళాల్సిఉంటుంది. కానీ అతను ఒక పాస్ పొందాడు. తాను ఎలిమినేట్ అవకుండా ఒక వారం ఆయన తనను  కాపాడుకునే చాన్స్ ఆ పాస్ తో ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ వారం ఎవరికి వారు స్ట్రాంగ్ గానే ఉన్నారు.

దానికి తోడు ఇది పన్నెండవ  వారం. ఉన్నది ఏడుగురు. పదిహేను వారాల గేమ్ లో ఈ వారం నుంచి ఎలిమినేషన్ మొదలుపెడితే 14వ వారానికే టాప్ ఫైవ్ వస్తారు దాంతో బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లేకుండానే కధ నడిపిస్తాడు అంటున్నారు. అలా చేయడం వల్ల డిసెంబర్ 6న వీకెండ్ లో ఒకరు, డిసెంబర్ 13న వీకెండ్ లో మరొకరు ఎలిమినేట్ అయితే అప్పటికి టాప్ ఫైవ్ ఉంటారని లెక్క. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ విన్నర్ ని డిసైడ్ చేస్తారన్న మాట. సో ఈ వారం నామినేషన్ లో ఉన్న వారు ఫుల్ హ్యాపీ ఫీల్ అవవచ్చు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: