బిగ్ బాస్ సీజన్ 4లో గురువారం ఎపిసోడ్ సూపర్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది. షోలో భాగంగా బిగ్ బాస్ దెయ్యం టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ మొదలైనప్పటి నుండి అరియానా భయపడుతూనే ఉంది. ఇక ఇదిలాఉంటే కన్ఫెషన్ రూం లో బిగ్ బాస్ దెయ్యం అదే జలజ స్పూన్స్ ఉంచి ఒక్కో హౌజ్ మేట్ ను వెళ్లి తీసుకురమ్మని చెబుతారు. అయితే ఒక్కరిగా వెళ్లేందుకు భయపడుతుంటే ఇద్దరిద్దరుగా వెళ్లమని చెబుతుంది.

అరియనా, అవినాష్ ఇద్దరు మొదట వెళ్లి కన్ఫెషన్ రూం లో స్పూస్న్ తీసుకుని వచ్చారు. అయితే అరియానా అవినాష్ ను గట్టిగా హగ్ చేసుకుని నానా రచ్చ చేసింది. అరియానా అలా భయపడుతుంటే బయట సోహెల్ డ్యాన్స్ వేశాడు. హారిక కూడా సోహెల్ కు వంతు పాడింది. అయితే తను భయపడేది లేదని చెప్పిన సోహెల్ కూడా కన్ఫెషన్ రూం లో స్పూన్ కోసం వచ్చి బుక్ అయ్యాడు.

అఖిల్, సోహెల్ ఇద్దరు వచ్చి స్పూన్ కోసం వెతికిన ఆ ఎపిసోడ్ ఈ సీజన్ కే హైలెట్ అని చెప్పొచ్చు. సోహెల్ భయపడిన తీరు ఫుల్ ఫన్ జెనరేట్ చేసింది. అయితే బయటకు వచ్చి మేమేమి భయపడలేదని చెప్పినా లోపల ఏం జరిగిందో హౌజ్ మేట్స్ అంతా ఊహించారు. అయితే అహిల్, సోహెల్ ఎపిసోడ్ వీకెండ్ లో నాగార్జున తప్పకుండా చూపిస్తారని అంటున్నారు. హౌజ్ మేట్స్ ముందు ఇజ్జత్ పోకూడదని అనుకున్నా నాగ్ తప్పకుండా ఈ ఎపిసోడ్ ను ఆరోజు చూపిస్తారని అంటున్నారు. మొత్తానికి అఖిల్, సోహెల్ ల పరువు నిట్టనిలువునా తీసేసేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేశాడని చెప్పొచ్చు.                                           

మరింత సమాచారం తెలుసుకోండి: