సమంత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎవరి నోట విన్నా ఈ పేరు వినపడుతుంది.. సామ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆమె డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. ఇకపోతే సామ్ పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ , వరుస హిట్స్ అందుకుంటూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు భారీ హిట్ తో పాటుగా సామ్ స్థాయిని మరింత పెంచాయి.. అక్కినేని కుటుంబ గౌరవం కూడా పదింతలు పెరిగాయి. ఇప్పుడు కొత్త ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వాటితో పాటుగా పలు టీవీ షో లు , కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది. 

తన భర్తతో కలిసి మాల్దీవులకు వెకేషన్ ట్రిప్ వేసింది. నాగ చైతన్య బర్త్ డేని అక్కడే సెలబ్రేట్ చేసి.. ఆ పరిసరాల్లోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. ఆ ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాత్‌టబ్‌లో బికినీ వేసుకొని జలకాలాడుతున్న ఫోటోను సామ్ అభిమానులతో పంచుకుంది..నాగ చైతన్య పుట్టినరోజు సంబరాలు ఫినిష్ అయ్యాక కూడా అక్కడే ఉంటూ క్లీవేజ్, బికినీ షోతో రచ్చ చేస్తోంది. పైగా ఆ ఫోటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. అయితే అక్కినేని కోడలు ఇలా క్లీవేజ్ షో ఇవ్వడాన్ని చూసి కొందరు అభిమానులు హర్ట్ అవుతూ వారి స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.. 



గతంలో సామ్ తన భర్తతో కలిసి జాలి ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ కూడా ఇలా బికినీ వేసుకొని అందాలను ఆరబోస్తూ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి వైరల్ కూడా అయిన సంగతి తెలిసిందే..సినిమాల పరంగా పెళ్లి తర్వాత జోష్ పెంచిన సమంత.. సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. కెమెరా ముందు ఎక్స్‌పోజింగ్ చేయడం, బోల్డ్ క్యారెక్టర్స్‌ను చేయడం మానేసిన ఈ అమ్మడు. ఇప్పుడు ఇలా హాట్ పిక్స్ ను షేర్ చేయడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.. మీరు ఆ హాట్ ఫోటోలను ఓ సారి చూసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: