రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లో కూడా అదరగొడుతున్నాడు. స్టార్ క్రేజ్ వచ్చీ రాగానే క్లాత్ బిజినెస్ లోకి దిగిన మన అర్జున్ రెడ్డి హీరో తమ్ముడిని కూడా అదేవిధంగా ఎంకరేజ్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అయితే సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది.

ఈ సినిమాలో రాఘవ పాత్రలో గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలనే ఓ మిడిల్ క్లాస్ క్యారక్టర్ లో అదరగొట్టాడు ఆనంద్. ఈ సినిమా హిట్ అవడంతో నిజంగానే హోటల్ బిజినెస్ లోకి దిగాడు ఆనంద్ దేవరకొండ. తన ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు జూనియర్ దేవరకొండ. అయితే తమ్ముడి సినిమా హిట్టైన జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ తమ్ముడి హోటల్ కు ప్రమోషన్ గా సూపర్ ఐడియా వేశాడు.

వీకెండ్ లో అదే శని, ఆదివారల్లో తమ్ముడు హోటల్ కు వచ్చి ఎవరేం తిన్నా అయిన బిల్లులో సగం తనే చెల్లిస్తానని చెప్పాడు. అంటే బిల్ 1000 రూపాయలు అయితే 500 కడితే సరిపోతుంది అన్నమాట. ఈ బంపర్ ఆఫర్ కు కచ్చితంగా రౌడీ ఫ్యాన్స్ తమ్ముడి హోటల్ ను సూపర్ హిట్ చేసేందుకు ఉపయోగిస్తారని చెప్పొచ్చు. అయితే విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ ఆఫర్ ను చూసి కొందరు షాక్ అవుతున్నారు. ఇలాంటి క్రేజీ ఐడియాలు అతనికి మాత్రమే ఎలా వస్తాయని అనుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు కాబట్టే విజయ్ దేవరకొండని సూపర్ అంటారు ఆడియెన్స్.                         

మరింత సమాచారం తెలుసుకోండి: