ఒక్క సినిమాతో ఇండియా మొత్తాన్ని తనవైపునకు తిప్పుకున్న యంగ్ హీరో.. యశ్. అతను నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమా ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. విమర్శకులను సైతం మెప్పించిన సినిమా ఇది. ఇందులో స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఫైట్స్ కూడా మాములుగా లేవు. తల్లి సెంటిమెంట్ కూడా తోడవడంతో ఈ సినిమా అందరినీ మెప్పించింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించారు.

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించారు. బ్లాక్ బస్టర్ సినిమా అయిన ‘కేజీఎఫ్’కు 66వ జాతీయ చలన చిత్రా అవార్డుల్లో రెండు అవార్డులు దక్కాయి. ఒకటి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌లో, మరొకటి బెస్ట్ ఫైట్స్ కేటగిరిల్లో జాతీయ అవార్డులు దక్కాయి. తన నటనతో అందరినీ మెప్పించాడు ఈ యువ హీరో. కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. కరోనా రాకపోయి ఉండి ఉంటే ఈ సినిమా అక్టోబర్‌కే థియేటర్లలో సందడి చేసేది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది.

షూటింగ్‌లో భాగంగా యశ్ హైదరాబాద్‌కు వచ్చారు. నవంబర్‌లో ప్రారంభం అయ్యే కేజీఎఫ్ ఛాప్టర్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు యశ్ గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే సినిమా యూనిట్ హైదరాబాద్‌కు వచ్చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది అంకానికి చేరుకుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. రాకీ కూడా షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మధ్య వరకు ఏక ధాటిగా జరగనున్నదని సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన అధిరా పాత్రలో సంజయ్ దత్ నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: