జగన్ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆయన ఒక మాట చెబితే అది నెరవేరుస్తారు అని ప్రజలౌ గట్టిగా నమ్ముతారు. ఇదిలా ఉంటే తెలుగువాడిగా పుట్టి తెలుగు ప్రజల గౌరవాన్ని అజారామరం చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గౌరవాన్ని ఇనుమడింపచేసే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు.

ఆ గానగంధర్వుడు తరతరాలు గుర్తుండిపోయేలా ఆయన పేరిట నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాలకు ఆయన పేరు పెట్టారు జగన్. ఇకపైన దాన్ని డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత నాట్య కళాశాలగా పిలుస్తారు. ఈ విధంగా బాలు తన జీవిత పర్యంతం పాటకు చేసిన సేవకు గాను జగన్ సర్కార్ తెలుగు ప్రజల తరఫున రుణం తీర్చుకుంది.

దీని మీద ఎస్పీ బాలు తనయుడు చరణ్ జగన్ కి ధన్యవాదాలు తెలియచేశారు. తన తండ్రికి ఇది గొప్ప గౌరవం అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే బాలు సొంత జిల్లా నెల్లూరు, ఆయన అక్కడే పుట్టారు, అక్కడే కచేరీలు చేశారు. అక్కడే తన పాటలతో అక్కడి జనాలను మొదటి శ్రోతలుగా చేసుకున్నారు.

ఆ తరువాత ప్రపంచం గర్వించతగిన గాయకుడిగా బాలూ ఎదిగారు. మరి బాలుకు భారత రత్న ఇవ్వమని కూడా జగన్ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఆ విధంగా స్పందించి చర్యలు తీసుకుంటే మన బాలూ భారత రత్నమే అవుతారు. బాలు పుట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన వారు అయిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు బాలూ అంటే చాలా ఇష్టం. అందువల్ల కేంద్ర పెద్దలతో ఆయన చర్చలు జరిపి ఈ గొప్ప గౌరవం బాలూకి దక్కేలా చూస్తారని ఆయనకు ఉన్న కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా బాలూకు జగన్ సర్కార్ అందించిన గౌరవం పట్ల పాటల ప్రేమికులు, బాలూని ఆరాధించేవారు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: