సంక్రాంతి అంటేనే సినిమా పండగ. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఉంటే బాక్స్ ఆఫీస్ యుద్ధం జరిగినట్టే వాతావరణం ఉంటుంది. అభిమానుల హడావిడి అయితే మాములుగా ఉండదు. ఇక ప్రతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి కి ఇటు మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరూ, అటు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యి సంచలన విజయం సాధించాయి. మా హీరో బెస్ట్ అంటే మా సినిమా బెస్ట్ అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వచ్చింది పరిస్థితి. ఇక ఈ పోరులో మహేష్ బాబు పై బన్నీ కాస్త పైచెయ్యి సాధించాడు. సరిలేరు , అల వైకుంఠపురం రెండు మంచి హిట్ సినిమాలుగా నిలిచినప్పటికీ, బన్నీ సినిమా అల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు నాన్ బాహుబలి రికార్డ్స్ ని సైతం తిరగరాసింది.



బన్నీ పై మహేష్ బాబు పై చెయ్యి

కాగా..ఈ ఉగాదికి సరిలేరు నీకెవ్వరూ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాగా అగస్ట్ 16 వ తేదీన ఈ సినిమా టీవీ ల్లో టెలికాస్ట్ చేయబడింది. బారి అంచనాల మధ్య టెలివిజన్ లో ప్రసారం చేయాగా సరిలేరు సినిమాకు 23.4 టీఆర్పీ దక్కింది. ఇక అల వైకుంఠపురం సినిమాకు మాత్రం 29.4 టీఆర్పీరేటింగ్ వచ్చి అల్లు అర్జున్ మరోసారి తన బలాన్ని చూపించుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ పైన మహేష్ బాబు పై చేయి సాధించాడు. ఇటీవల కాలంలో మరోసారి సరిలేరు నీకెవ్వరూ సినిమాను ప్రసారం చేయగా, అల వైకుంఠపురం సైతం మరోసారి టెలివిజన్ లో టెలికాస్ట్ చేసారు. ఈ సారి మహేష్ బాబు కి 17.4 టీఆర్పీ నమోదు కాగా, అల వైకుంఠపురం సినిమాకు 7.91 రేటింగ్ మాత్రమే దక్కింది. ఇలా సంక్రాంతి నుండి మొదలయిన పోటీలో మొదటిసారి మహేష్ బాబు తన ఆధిక్యతను ప్రదర్శించారు. బన్నీ సినిమాకు తక్కువ రేటింగ్ రావడానికి కారణాలు లేకపోలేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ' అలా..' మూవీ అందుబాటులో ఉండటం, అన్ని లోకల్ చానెల్స్ లో రిపీట్ మోడ్ లో సినిమాను ప్రసారం చేయడం వల్ల సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: