బాలీవుడ్ బ్యూటీలు తెలుగు సినీ పరిశ్రమలో మన హీరోలతో ఆడి పాడడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో బాలీవుడ్ భామలు తమ అందాలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హిందీ హీరోయిన్స్. ఇప్పటికే కత్రినా కైఫ్ విక్టరీ వెంకటేష్ తో జత కట్టింది. శ్రద్ధా కపూర్‌ సాహోతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు జక్కన్న సినిమా ఆర్ ‌ఆర్ ‌ఆర్ ‌తో ఆలియా భట్ బిజీగా ఉంది. ఇంకో వైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు.

ఇలా తెలుగు చిత్ర సీమలో బాలీవుడ్ బార్బీ బొమ్మలు స్పీడ్ పెంచేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో కూడా తమ సత్తా చాటాలని అనుకుంటున్నారో ఏమో కానీ, టాలీవుడ్ పై మనసు పడుతున్నారు ఈ ముద్దు గుమ్మలు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ తెలుగు పరిశ్రమకు వచ్చేస్తుంది అన్న వార్త వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం సోనమ్‌ కపూర్‌ కూడా  టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  కథ ఏంటి..?.. హీరో మరియు దర్శకులు ఎవరు..?? అన్న విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఓ స్టార్ హీరో సరసన నటించేందుకు సోనమ్‌ తో సంప్రదింపులు జరుపుతోందట ప్రముఖ నిర్మాణ సంస్థ. కథ నచ్చడంతో  సోనమ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

కాగా సోనం కపూర్ తో రొమాన్స్ చేయనున్న ఆ హీరో ఎవరు..?? మిగిలిన విషయాలు తెలియాలంటే... అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా సోనం కపూర్ తెలుగు తెరపై కనిపించనున్నారు అన్న వార్త చాలా సంతోషకరం అంటున్నారు నెటిజన్లు. మరి ఇంతకుముందు హీరోయిన్ల లాగా మెరుపుతీగలాగా ఇటు వచ్చి అటు వెళ్లి పోతుందా లేదా టాలీవుడ్ లో పాతుకు పోతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: