ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....హాట్ యాంకర్ విష్ణు ప్రియ గుర్తుందా? అదేనండి సుధీర్ తో కలిసి "పోవే పోరా" షో చేసింది కదా ఆ విష్ణు ప్రియ.. మొదట చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసి బుల్లి తెరనుంచి ఇప్పుడు వెండి తెరకి రాబోతుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దు గుమ్మ... వివరాల్లోకెళితే...చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా 'చెక్ మేట్'. డాక్టర్ రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విష్ణుప్రియ ఈ విధంగా స్పందించింది..


 ''చెక్ మేట్ అంటే ఇద్దరు యవ్వనస్తుల మధ్య ఉండే సమస్యను, ఒకరి వల్ల ఒకరు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ సమస్య నుంచి బయట పడడానికి అవతల వాళ్ళు తీసుకున్న యాక్షన్ చెక్ మేట్. ఈ అవకాశం నాకు శివరాత్రి రోజు వచ్చింది. ఆ శివుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటాను. స్టొరీ ఏంటి? హీరో ఎవరు అని అడగలేదు. మా మమ్మీ వాళ్ళ మ్యుచివల్ ఫ్రెండ్స్ ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చి నన్ను చూసిన తరువాత నువ్వే హీరోయిన్ అంటే నేను నమ్మలేదు. అయితే ఒక వారం రోజులకే ఆర్ఎఫ్‌సకి పిలిచి షూట్ మొదలు పెట్టినప్పుడు అక్కడున్న కెమెరాలు, ఆ వాతావరణం చూసి బ్లాక్  అయ్యాను. నాకు అసలు నటన  ఏమి తెలీదు. కానీ ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నాను.


సినిమా నాకు వెరి స్పెషల్. నాకు ఎంతో నేర్పించింది. నాకు మంచి వ్యక్తులను పరిచయం చేసింది నాకు ఎన్నో మెమోరీస్ ఇచ్చింది. అమ్మ రాజశేఖర్ రెండు సాంగ్స్ కొరియోగ్రఫీ చేసారు చాలా బాగా కొరియోగ్రఫీ చేసారు మీరందరూ ఎంజాయ్ చేస్తారు. కచ్చితంగా నేను మంచి స్టార్ హీరోయిన్ అయ్యి బాగా ఆకట్టుకుంటాను.'' అని స్పందించింది. మరి విష్ణు ప్రియ ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుకొని సమంత, అనుష్క ల అంత గొప్ప హీరోయిన్ కావాలని కోరుకుందాం అంటూ నెటిజనులు పలు రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి వారి కామెంట్స్ నిజం కావాలని కోరుకుందాం...ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: