సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతం కిచ్లుని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. గౌతం కిచ్లుతో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నా సరే కాజల్ తన లవ్ స్టోరీ గురించి ఎప్పుడు ఎక్కడ లీక్ చేయలేదు. అంత సీక్రెట్ గా వ్యవహారం నడిపించి ఫైనల్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది అమ్మడు. చేతిలో సినిమాలు ఉన్నా కూడా కాజల్ తన పెళ్లి విషయంలో వెనక్కి తగ్గలేదు.

గౌతం తో తన పెళ్లి గురించి ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది కాజల్. ఏడేళ్లుగా తెలుసు.. నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నామని చెప్పి నిజంగానే కాజల్ సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇదిలాఉంటే తమ అభిమాన నటి పెళ్లితో దిగులుగా ఉన్నారు కాజల్ తెలుగు ఫ్యాన్స్. వారిలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది కూడా ఉన్నాడు. కాజల్ పెళ్లి వల్ల చాలా డిస్ట్రబ్ అయ్యాడట. అంతేకాదు కాజల్ మీద ఉన్న ప్రేమతో జబర్దస్త్ లో ఓ స్కిట్ కూడా వేశాడు.

జబర్దస్త్ లో హైపరి ఆది బర్నింగ్, ట్రెండింగ్ టాపిక్స్ మీద స్కిట్స్ చేస్తుంటాడు. కాజల్ పెళ్లిపై హీరోల స్పందన అన్నట్టుగా లేటెస్ట్ స్కిట్ చేశాడు. ముందు హీరోలుగా కనిపించిన జబర్దస్త్ టీం మేట్స్ వారి ఒరిజినాలిటీతో చేశారు. అంతేకాదు కాజల్ ఇంటికి వెళ్లి ఆమెని నిలదీయాలని అనుకున్నారు. గురువారం రాత్రి జబర్దస్త్ లో హైపర్ ఆది కామెడీ అదిరింది. షో సూపర్ సక్సెస్ అయ్యింది.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: