టాలీవుడ్ లో టైం చాలా ముఖ్యం. ఒక రోజు గడిచింది అంటే చాలు బయట నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీ రెట్లు పెరిగిపోతాయి. అలాంటిది 365 క్యాలండర్ నే కరోనా మింగేసింది. ఇక సినిమా చూసే అలావాటుని జనాలకు తప్పించేసి భవిష్యత్తును బెంగ పెట్టేసింది. ఈ టైంలో సినిమా కంటే ఓటీటీ నయం అనుకునే జనాలు పెరిగారు. దాంతో టాలీవుడ్ వేయి స్లంపులను ఒకేసారి ఎదుర్కొంటోంది.

ఇవన్నీ పక్కన పెడితే 2020 సంక్రాంతి తరువాత టాలీవుడ్ కి సినీ కళ లేదు. ఇపుడు మరో సంక్రాంతి దగ్గరలో ఉంది. అయినా సినిమాలు రిలీజ్ కి వెనకా ముందూ ఆడుతున్నారు. దానికి కారణం కరోనా సెకండ్ వేవ్ భయమే. ఇక సమ్మర్ అంటూ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఆ సమ్మర్ కూడా ఆరు నెలల్లో ఉంది. బడా స్టార్స్ మూవీస్ అన్నీ కూడా మెల్లగా షూటింగులు జరుపుకుంటున్నాయి.

దాంతో సమ్మర్ కి కూడా ఈ మూవీస్ రెడీ కాకపోవచ్చు అని అంటున్నారు. మెగాస్టార్ ఆచార్య మూవీ అరవై శాతం షూటింగ్ జరగాలి. కరోనా సెకండ్ వేవ చూసుకుని సంక్రాంతి తరువాత మెగాస్టార్ చిరంజీవి చరణ్ సెట్స్ లోకి దిగితారని టాక్. అంటే అప్పటి నుంచి షూటింగ్ మొదలెట్టినా కూడా సమ్మార్ కి ఆచార్య రాదు అనేస్తున్నారు. ఇపుడున్న సమాచారం ప్రకారం దసరాకు ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఇక అదే వరసలో బాలయ్య బోయపాటి మూవీ కూడా వేసవి నాటికి రిలీజ్ చేసేందుకు కుదరకపోవచ్చు అంటున్నారు. ఇక మరో వైపు ప్రభాస్ మూవీ రాధేశ్యాం కూడా విదేశాల్లో షూటింగ్ పార్ట్ చేయాల్సిఉందిట. దాంతో ఆ మూవీ సైతం సమ్మార్ కి టాటా చెప్పేస్తోంది అంటున్నారు. అటూ ఇటూ తిరిగి చూస్తే  పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, వెంకటేష్ నారప్ప వంటి మూవీస్ ఈసారి వేసవికి సందడి చేయవచ్చు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: