టాలీవుడ్ అంటే సౌత్ లో అతి పెద్ద సినీ పరిశ్రమ. ఇక్కడ ఉన్న టాలెంట్ చాలా ఎక్కువ. ఆ మధ్య కాలం దాకా పాతిక మంది దాకా అద్భుతమైన హస్య నటులు టాలీవుడ్ కి ఉండేవారు. ఇక సంగీతపరంగా చూసుకున్నా టేకింగ్ పరంగా అయినా సరిసాటిగా నిలుస్తోంది అంతే కాదు టెక్నికల్ వాల్యూస్ విషయంలో నాలుగు దశాబ్దాల నుంచే టాలీవుడ్ ఆదర్శంగా ఉంది.

అటువంటి టాలీవుడ్ లో కంటెంట్ కి ఇపుడు లోపం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. కధలకు కొరత ఉందా అది నిజమేనా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. నిజానికి కధలు ఎక్కడ నుంచో పుట్టుకురావు. సమాజం నుంచే వస్తాయి. వాటిని తీసుకుని అద్భుతమైన కంటెంట్ తయారు చేసే సత్తా ఉన్న రచయితలు మనకు చాలా మంది ఉన్నారు.

కానీ టాలీవుడ్ మాత్రం రీమేకుల వెంట పరుగులు తీస్తోంది. టాప్ స్టార్స్ నుంచి చిన్న నటుల వరకూ అందరూ కూడా ఇతర భాషల్లో రిలీజ్ అయి హిట్ కొట్టిన మూవీస్ మీద పడుతున్నారు. ఆ హిట్ తో ఇక్కడ మజా చేసుకోవాలనుకుంటున్నారు. మెగాస్టార్ గా సినీ పెద్దగా ఉన్న చిరంజీవి ఏకంగా రెండు రీమేక్ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని న్యూస్ రావడం విశేషం.

ఆయన వేదాళం తో పాటు లూసీఫర్ సినిమాలు రీమేక్ చేస్తున్నారు. ఇక మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా నారప్ప సినిమా అసుర రీమేక్ గా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్  అయ్యప్పనుం కోషియం పేరిట తెలుగులో రీమేక్ మూవీ చేస్తున్నారు. అలాగే ఆయన రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కూడ రీమేక్ కావడం విశేషం. ఇదే తీరున  మరికొందరు యంగర్ హీరోలు కూడా రీమేకుల బాట పడుతున్నారు. నిజానికి టాలీవుడ్ కి టాలెంట్ ఉండి కూడా ఎందుకు రీమేకుల బాటన నిర్మాతలు హీరోలు పడుతున్నారు అన్నది అర్ధం కావడం లేదు అంటున్నారు. టాలీవుడ్ నుంచి మంచి కంటెంట్ తీసుకుని హిట్ చేస్తే తెలుగు సినిమా స్టామినా పెరుగుతుంది. సత్తా కూడా తెలుస్తుంది. ఆ దిశగా మన హీరోలు, మేకర్స్ ఆలోచన చేయకపోతే టాలీవుడ్ కి రీమేకులు మేకుల్లా దిగి క్రియేటివిటీ దెబ్బతినిపోతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: