టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా  ద్వారా రంగప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయన కొన్ని సినిమాలు యూట్యూబ్ లో అక్కడి ప్రేక్షకులను అలరించగా తనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉందని బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు శ్రీనివాస్.. అయితే బాహుబలి సినిమా దగ్గరినుంచి బాలీవుడ్ లో తెలుగు సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.. ఈ నేపథ్యంలో బెల్లంకొండ స్ట్రెయిట్ గా ఓ హిందీ చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి.. నిజంగా చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ తెలుగులోనే అంత సఖ్యతగా లేదు..

అలాంటప్పుడు ఇక్కడ కెరీర్ ను చక్కదిద్దుకోకుండా అక్కడ సినిమా చేయడంపై కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి.. ఇక ఈ సినిమా కి వివి వినాయక్ దర్శకత్వంల వహిస్తుంది.. అయినా ఒక తెలుగు హీరో తెలుగు సినిమా ను తెలుగు డైరెక్టర్ తో హిందీ లో రీమేక్ చేయడంలో వారి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావట్లేదు.. టాలీవుడ్ లో అల్లుడు శ్రీను సినిమా తో పరిచయమైనా బెల్లంకొండ శ్రీనివాస్ టాప్ హీరోయిన్స్ తో నటించడం మొదటినుంచి అలవాటు చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను ‘అల్లుడు శీను’తో తెలుగులో లాంచ్ చేసింది వినాయకే. అప్పటికేి చాలా పెద్ద రేంజిలో ఉన్నప్పటికీ బెల్లంకొండ సురేష్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన కొడుకును లాంచ్ చేయడానికి ముందుకొచ్చాడు.

ఇప్పుడు అదే హీరో ను బాలీవుడ్ లో లాంచ్ చేయడం వినాయక్ కే చెల్లింది. ప్రస్తుతం సీతా సినిమా ఫ్లాప్ కావడంతో అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. న‌భా న‌టేష్‌, అను ఎమ్మాన్యుయేల్, రాయ్‌ల‌క్ష్మీ,  సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. కందిరీగ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు  సంతోష్ శ్రీనివాస్సినిమా కి దర్శకుడు. నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గొర్రేల సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: