సినిమా అంటే చాలా కాంప్రమైజ్ లు ఉంటాయి. అలాగే నిర్మాతలను ఇబ్బంది పెట్టె సంఘటలను జరుగుతాయి. ఒక్కోసారి లొకేషన్స్ లో జరిగే గొడవలు తారాస్థాయికి వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. మర్యాదలు తగ్గాయనే, మంచి ఫుడ్ పెట్టలేదనో, సరైన ఏర్పాట్లు జరగలేదనో హీరో హీరోయిన్స్ గొడవలు పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. సినిమా సెట్లో జరిగిన చిన్న విషయం చిలికి చిలికి గాలివాన గా మారింది.



కుక్కకు అవమానం..ఆగిన షూటింగ్

దాదాపు యాభయేళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, జయలలిత హీరోయిన్ గా గూఢచారి 116 సినిమా వచ్చింది. అప్పట్లో ఇది చాలా పెద్ద హిట్ సినిమా. జేమ్స్ బాండ్ తరహా సినిమాను మొట్ట మొదటిసారి కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. గూఢచారి సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించడంతో అతి పెద్ద విజయం సాధించింది. కృష్ణ కి అప్పటికే మంచి ఇమేజ్ వుంది. అయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండాలని స్టార్ హీరోయిన్ అయినా జయలలిత ను కృష్ణ కి జోడిగా అనుకున్నారు. జయలలితకు కుక్కలంటే చచ్చేంత ఇష్టం. ఆమె దగ్గర అనేక రకాల జాతుల కి చెందిన కుక్కలు ఉండేవి. షూటింగ్ గ్యాప్స్ లో ఎపుడైనా బోర్ కొడితే ఆమె తన పెంపుడు కుక్కలను తెప్పించుకునే వారు. ఇక గూఢచారి సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన జయలలిత ఇంటి నుండి తన కుక్కలను కూడా సినిమా సెట్స్ కి తీసుకువచ్చింది.



అప్పటికే సినిమా షూటింగ్ దాదాపు అయిపొవస్తుందట. ఆ సమయంలో తన కుక్క కి సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదని జయలలిత అలిగారట. అంతే కాదు ఎవరితో ఒక్క మాట కూడా చెప్పకుండా షూటింగ్ నుండి తన కుక్కలను తీసుకొని వెళ్లిపోయారట. దాంతో సినిమా ప్రొడ్యూసర్ కి దర్శకుడికి విపరీతమైన కోపం వచ్చి జయలలిత ను పిలిపించి ఆమెకు రావాల్సిన డబ్బును సెటిల్ చేసి పంపించేసారట. మిగతా సినిమాను ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని అనుకున్నదానికంటే ముందే పూర్తి చేసి ఆమెను వదిలించుకున్నారట. ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం ఒక కుక్క కోసం షూటింగ్ ఆపడాన్ని అప్పట్లో అన్ని పత్రికలూ కవర్ చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: