మలయాళ దర్శకుడు, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక డేటింగ్ చేస్తుందట. ఈ విషయాన్ని ప్రముఖ ఫిలింస్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీలో రష్మిక మందన బయోగ్రఫీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి అనుపమా పరమేశ్వరన్ ప్రియుడు చిరంజీవ్ మక్వానా అని ప్రచారంలో ఉంది. అందుకనే, అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన రిలేషన్షిప్లో ఉన్నారని ఐఎండీబీలో అప్డేట్ చేశారు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే రష్మికనో లేదంటే చిరంజీవ్ మక్వానానో చెప్పే వరకు ఆగాల్సిందే. అప్పుడే దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది...
నిజానికి ఈ హాట్ బ్యూటీ కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపి డేటింగ్ కూడా చేసింది.వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తరవాత వ్యక్తిగత కారణాలతో రక్షిత్ శెట్టితో పెళ్లిని రద్దు చేసుకుంది. టాలీవుడ్లో రష్మిక బాగా రాణిస్తుండటంతో ఆ జర్నీని కొనసాగించాలనే ఉద్దేశంతోనే రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోయిందని అప్పట్లో రూమర్స్ బాగా చక్కర్లు కొడుతూ వినిపించాయి.
ఆ తరవాత విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన రష్మిక మందన విజయ్ తో రిలేషన్షిప్లో ఉందనే ప్రచారం జరిగింది. ఈ వదంతులను అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఖండించారు. అయితే, ఇప్పుడు అనుపమా పరమేశ్వర్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన డేటింగ్ చేస్తుందనే వార్త హాట్ టాపిక్‌గా మారటమే కాకుండా రష్మిక ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...