బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో చూస్తే ఈరోజు ఎపిసోడ్ మొత్తం హాట్ హాట్ గా కొనసాగిందని తెలుస్తుంది. ముఖ్యంగా అభిజిత్ మీద బిగ్ బాస్ సీరియస్ గా ఉండగా నాగార్జున కూడా అదే సీరియస్ కొనసాగించారు. బిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం బయట సోషల్ మీడియాలో అభిజిత్ విన్నర్ గా కామెంట్స్ వస్తున్నాయి. అయితే అతను విజేత అయ్యేందుకు అనర్హుడని కొందరు అంటున్నారు.

ఇదిలాఉంటే సీజన్ 4లో ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని అభిజిత్ ఎలా విన్నర్ అవుతాడని కొందరు అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ వీక్ జరిగిన దెయ్యం టాస్క్ లో అభిజిత్ అఖిల్, మోనాల్ తో కలిసి టాస్క్ ఆడాల్సి ఉండగా అది ఆడలేదు. అయితే దానికి అభిజిత్ ను వరస్ట్ పర్ఫార్మర్ గా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూడా అభిజిత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

బిగ్ బాస్ చెప్పినదానిలో తప్పేమి లేదని నువ్వు అన్న మాటలే ఆయన చెప్పారని అన్నాడు. టాస్కులు చేయకపోవడం క్షమించమని అడగడం ఇలా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఇష్టం లేకపోతే ఈ నిమిషమే హౌజ్ నుండి వెళ్లొచ్చని గేట్ కూడా ఓపెన్ చేశారు నాగార్జున. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ మొత్తం అభిజిత్ మీద ఫైర్ అవడమే ఉందని తెలుస్తుంది.                                                                       



మరింత సమాచారం తెలుసుకోండి: