టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే మొదట వినిపించే పేరు రామ్ గోపాల్ వర్మ. ఈయన చేసే పనులకు మన తెలుగు ప్రేక్షకులు.. ఈయనకు 'వివాదాల దర్శకుడు' అనే బిరుదును ఇచ్చేసారు. ఆ రేంజ్ లో మన RGV ఇండ్రస్టీలో ఉన్న వారందరికీ సంబంధించిన విషయాల్లో వేలుపెట్టి కెలుకుతూ ఉంటాడు. అయితే మన RGV కి తెలిసింది ఒక్కటే తనకు నచ్చిన విషయాన్ని సపోర్ట్ చేస్తూ.. నచ్చని విషయాలపై సెటైర్ వేస్తూ విమర్శలపాలు అవుతూ ఉంటాడు.ఇక తాజాగా జీహెయ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పవర్ స్టార్ పవన్‌పై సటైర్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఇంతకు ముందు ఇదేవిదంగా పవర్ స్టార్ అంటూ ఓ సినిమా తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌జీవీ రాజకీలపై ఆసక్తి చూపుతున్నాడు.
 
అందులోనూ గ్రేటర్ ఎన్నికలపై మరీ ఎక్కవగా చూపుతున్నాడు. ఎందుకంటారా అందులో పవన్ పోటీ చేస్తున్నాడనట. 'పవన్ కళ్యాణ్ ఓ గొప్ప ఎంటర్‌టైనర్. అందుకనే నేను రాజకీయాల్లో అతన్ని మాత్రమే అనుసరిస్తా. నాకు పవన్ తప్ప రాజకీయాల గురించి ఏమీ తెలియద'ని వర్మ అన్నాడు.
తాను కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నిల్లో పవన్ మాత్రమే అనుసరిస్తానని అందుకు కారణం రెండు ట్వీట్లని అన్నాడు.మొదటిది ఎన్నకల్లో పవన్ పోటీ చేయడం.. మరొకటి అదే పోటీ లేకపోవడం అంటూ సెటైర్ వేశాడు. అయితే పవన్ అబిమానులు అది ప్రశంసో, సెటైరో తెలుసుకోలేని పిచ్చోళ్లేమీ కాదు.

 దాంతో ఆర్‌జీవీ పవన్‌పై సెటర్లను ఆపాలని..లేదంటే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియాలలో కామెంట్స్ రూపంలో మన రామ్ గోపాల్ వర్మ కి వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇదిలావుండగా ఇంతకు ముందు కూడా వర్మ.. పవన్ కళ్యాణ్ పై పవర్ స్టార్ అనే సెటైరికల్ మూవీ తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్.. RGV పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వర్మ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఆ సినిమాని డిజిటల్ ప్లాట్ ఫాం పై రిలీజ్ చేసాడు. ఇక ప్రస్తుతం RGV.. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలుసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: