ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో కి  ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్ని డాన్స్ షో లు వచ్చినప్పటికీ ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ  డాన్స్ కి  మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎన్నో  సీజన్ ల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం టాప్ రేటింగ్  సొంతం చేసుకుంటూ వస్తుంది డాన్స్ షో.  ఒకప్పుడు కేవలం డాన్స్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా అందుతూ ఉండడంతో డాన్స్ షోకి మరింత క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి.



 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ దూసుకుపోతుంది డాన్స్ రియాలిటీ షో ఢీ. ప్రతివారం డాన్స్ రియాల్టీ షో డీ లో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో  పాటు ఎంతో పొట్ట చెక్కలయ్యే కామెడీతో ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ కాస్త ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది అనే విషయం తెలిసిందే. ఇక వచ్చే బుధవారం గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. సాధారణంగానే గ్రాండ్ ఫినాలే అంటే నిర్వాహకులు ఎంతో గ్రాండ్ గానే ప్లాన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే . ఈసారి కూడా గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ప్లాన్ చేశారు.



 ఇక ఇటీవలే ఢీ వచ్చే వారికి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో కాస్త  ప్రేక్షకులందరినీ తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. గ్రాండ్ ఫినాలే కావడంతో ప్రస్తుతం ప్రతి పర్ఫామెన్స్ కూడా అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది ఇక చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రతి పర్ఫామెన్స్ గూస్బమ్స్  కూడా వస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రతి పర్ఫామెన్స్ చూస్తున్నంతసేపు కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. ఈ ప్రోమో చూస్తే ఈ వారం షో అదిరిపోయేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: