బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం నలుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ వారం అసలు ఎలిమినేషన్ ఉండదని వార్తలు వస్తున్నాయి. అయితే ఎలిమినేషన్ పై బిగ్ బాస్ షాక్ ఇచ్చినా ఇస్తాడు. బయట ఆడియెన్స్ ఏదైతే అనుకుంటాడో దానికి వ్యతిరేకంగా చేయడమే బిగ్ బాస్ నిర్వాహకుల పని. శనివారం ఎపిసోడ్ లో అభిజిత్ తప్పులను నాగార్జున వేలెత్తి చూపించే ప్రయత్నం కూడా అందులో భాగమే అంటున్నారు.

అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అసలైతే ఈ వారం మోనాల్ బయటకు వెళ్తుందని అనుకున్నారు కాని అభిజిత్, హారిక ఫ్యాన్స్ మోనాల్ కు సపోర్ట్ చేశారని టాక్. అందుకే ఈ వారం హౌజ్ నుండి వెళ్లేందుకు అవినాష్, అఖిల్ లకు తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. అయితే అఖిల్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. కాని ఈ వారం సేఫ్ అవుతాడా లేదా అన్న డౌట్ కూడా ఉంది. ఇదిలాఉంటే ఈ వారం అసలు ఎలిమినేషన్ అనేది ఉండదని టాక్.

అయితే చివరి దాకా తీసుకెళ్లి ఫైనల్ గా నాగ్ ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున షాక్ ఇస్తాడని అంటున్నారు. అయితే 12వ వార్మ్ ఎలిమినేషన్ మిస్సయితే మాత్రం 13వ వారం మాత్రం తప్పకుండా ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే టాప్ 5.. టాప్ 3 ఎవరెవరు ఉంటారన్నది ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.                                                                


మరింత సమాచారం తెలుసుకోండి: