హీరో హరీష్.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసి ఎన్నో అవార్డ్స్ ని సైతం చిన్నతనంలోనే తన ఖాతాలో వేసుకున్న నటుడు. బాలనటుడిగా వందల చిత్రాల్లో నటించి యుక్త వయసు రాగానే హీరో గా పరిచయం అయ్యాడు. టాలీవుడ్ లో ప్రేమ ఖైదీ సినిమా తో హీరో గా డెబ్యూ చేసిన హరీష్ కి అప్పట్లో లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేది. ప్రేమ ఖైదీ సినిమా తోనే ఖుష్బూ సైతం హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక ఇదే సినిమాను హిందీలో కరిష్మా కపూర్ ని పరిచయం చేస్తూ హరీష్ హీరోగా నటించగా అక్కడ సైతం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

కెరీర్ మొత్తంగా 280 సినిమాల్లో నటించిన హీరో గా మాత్రం అనుకున్నంత స్టార్ డం రాలేదు హరీష్ కి.



అహ నా పెళ్ళంటా సినిమాలో తెలుగులో ఆఖరుగా నటించిన హరీష్ బాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ఒక సినిమాలో నటించాడు. నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ అది కలిసి రాలేదు. ఎప్పటి కైనా దర్శకత్వం చేయాలనే ఆలోచనలో హరీష్ ఉన్నట్టు తెలుస్తుంది ముంబై అమ్మాయితో పెళ్లి ఇక హరీష్ వ్యక్తిగత విషయానికి వస్తే ముంబై కి చెందిన సంగీత అనే అంమ్మాయిని పెద్దలు సూచించగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. తన ఫ్యామిలీ బిజినెస్ చేస్తూ హరీష్ కాస్త బిజీ గానే ఉన్నప్పటికీ ఇప్పటికి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక సినిమా లైఫ్ ఫెయిల్యూర్ కి కారణం సౌత్ నుండి నార్త్ కి రావడమే అంటాడు హరీష్.



 తెలుగులో నటిస్తున్నప్పుడు హిందీ హీరో గా కనిపిస్తున్నావు అంటూ అందరు అనడంతో బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని మకాం ముంబై కి మార్చడంతో అటు సౌత్ లో దెబ్బ పడిందని, అనుకున్నంత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో కూడా కనుమరుగైపోయానని హరీష్ వాపోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: