సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. సినిమా సినిమా గ్యాప్ లో ఓ ఫారెన్ టూర్ వేస్తాడు. షూటింగ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి దూరంగా స్టార్స్ ఉంటారు. అందరు స్టార్స్ కన్నా మహేష్ తన ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. ఈ లాక్ డౌన్ లో మహేష్ తన ఫ్యామిలీతో చేసిన ఎంజాయ్ మెంట్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముఖ్యంగా మహేష్ తన కూతురు సితారతో చేసిన హంగామా తెలిసిందే.

ఇక గౌతం తో కూడా మహేష్ బ్యాడ్మింటన్ కూడా అదిరింది. మహేష్ తన ఇంట్లో ఎలా ఉంటాడో చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. అయితే మహేష్ తో సమానంగా గౌతం ఎదుగుతున్నాడు. గౌతం ను సడెన్ గా చూస్తే మహేష్ అనేలా కనిపిస్తున్నాడు. మహేష్, గౌతం లేటెస్ట్ గా బ్యాక్ లుక్ తో షాక్ ఇచ్చారు. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ బ్యాక్ పిక్ షేర్ చేశారు. చూస్తే ఇద్దరు ఈక్వల్ హైట్ ఉన్నట్టు కనిపిస్తున్నారు.

నట వారసుడిగా మహేష్ తనయుడిని తయారు చేసేలా ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: