త్రిష ఈ పేరు తెలియని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రెండు భాష్లో స్టార్ హీరోయిన్‌గా ఉందీ చెన్నై సుందరి. ఈ అమ్మడి కెరీర్ తుది దశకు వచ్చిందన్న ప్రతిసారీ ఏదో ఒక కొత్త ఆఫర్ రావడం, అది భారీ సక్సెస్ అందుకోవడం త్రిష మళ్లీ తన కెరీర్‌ను ముందుకు నడిపించడం జరుగుతున్న కథే. అయితే ఇటీవల త్రిష మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సారి ఓ రీమేక్ సినిమాకు ఓకే చెప్పింది. ఐదు సంత్సరాల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన ‘పీకు’ అనే సినిమా దక్షిణాదిలో రీమేక్‌ కానుంది.

ఈ సినిమాకే ఇప్పుడు త్రిష ఒప్పుకుంది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు త్రిష రెడీ అవుతుంది. ఈ రీమేక్‌ను తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కించే ప్రయత్రాలు జరుగుతున్నాయట. హిందీలో మంచి సక్సెస్ అందుకున్న ‘పీకు’ సినిమాలో దీపికా పదుకునే పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అందుకే ఆ పాత్రను చేసేందుకు త్రిష ఓకే చెప్పిందట. ఈ పాత్రలో త్రిష అందరిని మెప్పించ గలదా? అని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర మరింత ఛాలెంజింగా ఉంటుంది.

మరి అమితాబ్ ఛాలెంజ్‌ను ఎవరు చేస్తారో చూడాలి. ఈ పాత్ర కోసం తెలుగు, తమిళం రెండు భాషల ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో సీనియర్ నటుల పేర్లపై చర్చలు జరుగుతున్నాయట. మరి ఈ ఛాలెంజ్‌కు ఎవరు ఓకే చెబుతారో వేచి చూడాలి. ఈ సినిమాతో త్రిష మరోసారి తనను తాను నటిగా నిరూపించుకునే అవకాశం ఉందని, దీంతో పాటు ఖచ్చితంగా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. కుదిరితే వచ్చే ఏడాదిలోనే విడుదల కూడా కావచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: