కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా మాస్టర్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సూపర్ హిట్ డైరక్టర్ లోకేష్ తో చేసిన క్రేజీ సినిమా మాస్టర్. ఖైదీ సినిమాతో సత్తా చాటిన ఈ డైరక్టర్ విజయ్ ఫ్యాన్స్ అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా చూస్తున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ ఎక్కడన్నది మాత్రం తెలియలేదు.

విజయ్ మాస్టర్ సినిమాలు 100 కోట్ల ఓటిటి డీల్ వచ్చిదని సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తారని అన్నారు. కాని చిత్రయూనిట్ ఈ వార్తలని ఖండించింది. మాస్టర్ సినిమా ఓటిటి రిలీజ్ అవ్వట్లేదని టైం చూసుకుని థియేటర్ లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమా వస్తుంది.

సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా 40 మిలియన్ వ్యూస్ రాబట్టింది. చూస్తుంటే ఈ సినిమా మరో సంచలన సినిమాగా విజయ్ కెరియర్ లో నిలిచేలా ఉంది. తెలుగులో కూడా విజయ్ మాస్టర్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేలా ఉన్నారు. చూస్తుంటే 2021 సమ్మర్ లో ఈ సినిమా ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.                                                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: