రావు రమేష్ పరిచయం అక్కర్లేని పేరు రావు గోపాల్ రావు గారి  కుమారుడిగా టాలీవుడ్ లో తన విలనిజంతో ఆకట్టుకున్న నటుడిగా సుపరిచితమే..తన నటనతో తండ్రిని మించిన కొడుకుగా  రావు రమేష్ మంచి పేరు సంపాదించుకున్నారు ..విలన్ తో పాటు కామెడీ మరియు ఎమోషన్ సన్నివేశాలలో  రావు రమేష్ ఆద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు..

బాలకృష్ణ హీరోగా నటించిన సీమ సింహం అనే చిత్రం తో  తెలుగు సినిమాల్లోకి రావు రమేష్ పరిచయమయ్యారు.. అక్కడినుంచి వరుస సినిమాలు చేస్తున్న రావు రమేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం అనే  సినిమాలో రావు రమేష్ లెక్చరర్ పాత్రలో అద్భుతంగా నటించారు..  దాంతోపాటు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం గమ్యం సినిమాలో కూడా రావు రమేష్ అద్భుతమైన పాత్రలో నటించి ప్రీక్షకులని మెప్పించారు ..

అయితే రావు రమేష్ కి  నటనపై నే అస్సలు ఆసక్తి లేదట..  ఆయన ఇండస్ట్రీలోకి  దర్శకుడు  అవుదామని  అనుకున్నారట..  ఇదే విషయాన్ని రావు రమేష్ అతని తల్లి తో చెప్పగా రావు రమేష్ ని మందలించింది దర్శకత్వం అంటే 24 విభాగాలపై పట్టు  ఉండాలని, దర్శకత్వం చేయాలంటే చాలా ప్రతిభ ఉండాలని అన్నారు .. దర్శకుడి కంటే ముందు నటుడిగా నిరూపించుకో అని రావు రమేష్ వాళ్ళ తల్లి  హితబోధ చేసారు ..

తల్లి అలా చెప్పే సరికి మనసు మార్చుకున్న రావు రమేష్  డైరెక్షన్ ఆలోచన ని పక్కన పెట్టి  నటుడయ్యాడు..నటుడు అయ్యారు కాబట్టే గొప్ప గొప్ప పాత్రలలో మనం ఇప్పుడు అతని నటనని చూస్తున్నాం ..రావు రమేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒకరు..  రావు రమేష్ లాంటి ఒక నటుడు దొరకడం తెలుగు చలన చిత్ర పరిశ్రమ అదృష్టం... తండ్రి పాత్ర అయినా  విలన్ పాత్ర అయినా ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించే నటులలో రావు రమేష్ ఒకరు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: