బిగ్ బాస్ సీజన్ 4 ను ఆడియెన్స్ బాగానే ఆదరిస్తున్నట్టు ఉన్నారు. ప్రతి వారం లానే వీకెండ్ నాగార్జున ఈ సీజన్ లో ఈ వారం వచ్చిన ఓటింగ్ గురించి చెబుతాడు. అలానే ఈ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం 9.5 కోట్ల పైగా ఓట్స్ వచ్చాయని చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4ని ఎంతమంది చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు సీజన్ 4 మొదలుపెట్టే టైం కు ఐపిఎల్ కూడా మొదలైంది. అయినా సరే ఈ సీజన్ సక్సెస్ అయ్యింది.

ఇక ఇప్పుడు సీజన్ 4 చివరి ఎపిసోడ్స్ కు వచ్చింది. అందుకే అందరు బిగ్ బాస్ ను ట్యూన్ చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్ ఎవరన్నది చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఒకళా ఉంటే విజేతని మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఓటింగ్ ను బట్టి విజేతని ప్రకటిస్తారు.

బిగ్ బాస్ సీజన్ 4ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రతి వారం నామినేషన్స్, ఎలిమినేషన్ ఇవన్ని వారికి కిక్ ఇస్తున్నాయి. 12వ వారం హౌజ్ నుండి నలుగురు సేఫ్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని అంటున్నారు. చివరి వరకు ఉత్కంఠతగా చూపించి ఫైనల్ గా నో ఎలిమినేషన్ అనేస్తారని టాక్. మరి అది ఎలా ఉంటుందో ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: