ప్రముఖ తమిళ దర్శకుడు శివ ఇంట్లో  విషాదం చోటుచేసుకుంది.. శివ తండ్రి జయ కుమార్ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు.. జయ కుమార్ కి భార్య ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.. ఇందులో పెద్ద కొడుకే  దర్శకుడు శివ రెండో కొడుకు బాల నటుడిగా మలయాళ ఇండస్ట్రీ లో  స్థిరపడ్డారు.. ఇంకా అతని కూతురు విదేశాల్లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు.. జయ కుమార్  పలు షార్ట్ ఫిలిమ్స్ కి ఫోటోగ్రాఫర్ గా  పనిచేశారు..జయ కుమార్ ఇప్పటికి  సుమారు నాలుగు వందలకు పైగా షార్ట్ ఫిలిమ్స్ కి పనిచేసారు ..

జయ కుమార్  చాలా రోజులుగా  చెన్నైలోనే ఉంటున్నారు ..  సామాజిక సేవలో జయకుమార్ చురుగ్గా పాల్గొనేవారు .. జయ కుమార్ గారి తండ్రిగారైన వేలన్  కూడా సినీ పరిశ్రమకు చెందినవారే వేలన్ పలు తమిళ్ సినిమాలకి రచయితగా పని చేశారు..

జయకుమార్ పెద్ద కుమారుడు  శివ మొదటగా  సినిమాటోగ్రాఫర్గా గా సినీ  ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. శివ సినిమాటోగ్రాఫర్ గా తెలుగులో పలు సినిమాలు చేశారు.. ఆ తర్వాత సినిమా ఫోటోగ్రాఫర్ నుండి  దర్శకుడిగా మారారు.ఆలా దర్శకుడిగా 2008వ సంవత్సరంలో గోపీచంద్ తో శౌర్యం సినిమా  చేశారు.. ఆ తర్వాత తెలుగులో శంఖం మరియు రవితేజ తో దరువు చిత్రాలు  చేసినా అవి పెద్దగా ఆడకపోవడంతో  కోలీవుడ్ కి వెళ్లారు..

కోలీవుడ్ లో కార్తి హీరోగా సిరుతాయి అనే చిత్రంతో అడుగు పెట్టారు.. ఆ తర్వాత అజిత్ తో వరుస సినిమాలు చేస్తూ విజయాలను అందుకున్నారు.. అజిత్  చేసిన సినిమాలలో వరుసగా వీరం ,వేదాళం మరియు వివేకం ,విశ్వాసం చిత్రాలు ఉన్నాయి .. ఇందులో వేదాళం మరియు వివేకం సినిమాలు మంచి గుర్తింపు పొంది ప్రేక్షకులని అలరించాయి.. ప్రస్తుతం శివ  సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమాని రూపొందించడం లో బిజీ అయ్యారు ..  

మరింత సమాచారం తెలుసుకోండి: