ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ కావడంతో దీనిపై ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకుల్లో కూడా దీనిపై తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని యువ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా థమన్ మ్యూజిక్ ని, అలానే పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన మగువ మగువ లిరికల్ సాంగ్, అలానే పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లకు ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన పింక్ మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఎంతో అదిరిపోతుందని, ముఖ్యంగా సినిమాలో కోర్ట్ సన్నివేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, అలానే కోర్ట్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ప్రేక్షకుల మదిని తాకుతాయని అంటున్నారు. కోర్ట్ డ్రామా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోరుకునే పలు కమర్షియల్ అంశాలు కూడా దర్శకడు వేణు శ్రీరామ్ జోడించి వకీల్ సాబ్ ని తీస్తున్నట్లు టాక్. మరి ఇన్ని అంచనాలు ఉన్న ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: