వయసు పెరుగుతున్నది నిజమే.... కానీ గ్లామర్ తగ్గుతుంది అంటే మాత్రం ఒప్పుకోరు హీరోయిన్లు. ఇది కథానాయికలు తరతరాలుగా రిపీట్ చేస్తున్న పవర్ ఫుల్ డైలాగ్. ఒకప్పుడు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలకు వయసు పెరుగుతున్న కొద్దీ... హీరోయిన్లుగా ఆఫర్ లు కూడా తగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే నటన పై ఉన్న మక్కువతో వయస్సు పెరుగుతున్నా ఫేస్ లో గ్లామర్ మెయింటెన్ చేసేందుకు తెగ ఆరాట పడుతుంటారు.

ఎంతో కష్టపడి బాడీ షేప్ ను కంట్రోల్లో ఉంచుకుంటారు.  వారి ఫ్యాషన్ పై వాళ్లకు ఉన్న ప్రేమ అటువంటిది. అయితే ఇదే తరహాలో హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అప్పట్లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. దాదాపు అందరి అగ్ర కథానాయకుల సరసన హీరోయిన్ గా నటించారు సిమ్రాన్. కానీ వయసు మీద పడ్డాక ....మీ వయసు దాటిపోతుంది అంటే మాత్రం హీరోయిన్లు అస్సలు అంగీకరించరు.

 ఓల్డ్ మ్యాజికల్ బ్యూటీ సిమ్రాన్ కూడా ఇదే మాట రిపీట్ చేస్తున్నారు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా నలభైనాలుగే’ అంటూ..పాత పాటను కొత్తగా పాడేస్తున్నారు. సిమ్రాన్ ట్విట్టర్‌ని లేటెస్ట్‌గా చూస్తే ఎవరైనా ఆమె ఆలోచనా శైలికి ఆహా... అనాల్సిందే. చూస్తుంటే వయసు పాతికేళ్లు తగ్గినట్లుగా లేదూ..? అప్పటి సిమ్రాన్‌కి ఇప్పటి సిమ్రాన్‌కి ఎంత వ్యత్యాసం ఉంది కదా.. అదీ మరి సిమ్రాన్ అంటే. 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంలో  సిమ్రాన్  తన పాత్ర పోషించారు. టాలీవుడ్ లో అగ్రహీరోల సరసన  ఎక్కువగా అవకాశాలు అందుకున్నారు. సినిమా రంగం నుంచి దూరంగా వెళ్లి చాలా గ్యాప్ ఇచ్చినా..  తిరిగి రావాలనే ఆలోచనతో ఉన్నారు ఏమో కానీ.... అదే ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ.... తన అందాన్ని గుర్తు చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: