బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎవరు స్ట్రాంగ్ అన్నది మరో మూడు వారాల్లో గేం ముగుస్తుండగా కూడా క్లారిటీ రావడం లేదు. ఈ సీజన్ లో విన్నర్ ఎవరు అన్నది అంతు పట్టడంలేదు. ఇప్పటిదాకా వినిపించిన పేర్లు కానీ, కనిపించిన వారు కానీ ఒక్కసారి తెర వెనక్కు వెళ్తున్నారు. అసలు గేం లో ఉంటుందా లేదా అన్న మోనాల్ మాత్రం ముందుకు రావడం అంటే నిజంగా గ్రేట్ అనుకోవాలేమో.

గత రెండు మూడు వారాల  నుంచే మోనాల్ తన గేం ప్లాన్ మార్చింది. అందుకే ఈసారి నామినేషన్లలో ఆమె ఉన్నా కూడా మొదటే సేవ్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. తాను మోనాల్ కంటే రెండు వందల రెట్లు బెస్ట్ ప్లేయర్ అని అవినాష్ భావించినా మోనాల్ ముందు సేవ్ అవడం అంటే ఆడియన్స్ ఆమెను ఎలా ఆదరించారో అర్ధం చేసుకోవాలి.

మోనాల్ ఏడుపులో ఎమోషన్స్ లో ఒక నిజాయతీ ఉందని ఆడియన్స్ భావించడమే ఇందుకు కారణం అంటున్నారు. ఇదిలా ఉంటే మోనాల్ గజ్జల్ సేవ్ అవడం అఖిల్ ఇంకా నామినేషన్ లో డేంజర్ లో ఉండడం మరో విశేషం. ఇక ఆరియానా బోల్డ్ నెస్ కి జనాలు ఫిదా అయ్యారని, ఆమె ఈసారి సేవ్ అవుతుందని అంతా అనుకున్నా కూడా ఆమె కూడా ఫస్ట్ ప్లేస్ లో లేదు అని అంటున్నారు.

మోనాల్ మాత్రం అందరి ఆలోచనలను తల్లకిందులు చేసింది అంటున్నారు. హౌస్ లో ఆమె పట్ల తోటి కంటెస్టెంట్లకు చిన్న చూపు ఉన్నా కూడా ఆమె ఆడే విధానమే చివరికి ఆమెను సేవ్ చేసింది అంటున్నారు. ఇక హారిక ఆమెను నామినేషన్స్ లో పెట్టడం వల్ల కూడా సానుభూతి లభించింది అంటున్నారు. మొత్తానికి చూస్తే బిగ్ బాస్ లో అనేక ట్విస్టులు ఇపుడు చోటు చేసుకుంటున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: