బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ ఎవరు అంటే అంతా చెబుతున్న ఒకే ఒక మాట అభిజిత్ అని. అభిజిత్ తనదైన స్టైల్ లో గేం ఆడుతున్నాడు. మైండ్ పెట్టి మరీ  గేం లో ముందుకు సాగుతున్నాడు. అభిజిత్ బిగ్ బాస్ ని చదివేశాడా అన్నట్లుగా ఆట ఆడుతున్నాడు. బయట కూడా ఫ్యాన్ మెయిల్ ఎక్కువగా ఉంది. అంతే కాదు, సెలిబ్రిటీస్ కూడా అభిజిత్ కచ్చితంగా గెలుస్తారు అంటున్నారు.

ఈ నేపధ్యంలో 12వ్ వారం మాత్రం అభిజిత్ కి టఫ్ గానే సాగింది. బిగ్ బాస్ జలజ పేరిట ఇచ్చిన రెండు టాస్కులను అభిజిత్ చేయలేదు. పైగా తాను చేయలేను అంటూ ఓ విధంగా ధిక్కరించే ధోరణిలోనే బిగ్ బాస్ కి చెప్పేశాడు. దాని మీద హోస్ట్ గా వచ్చిన నాగార్జున తీసుకున్న క్లాస్ తో అభిజిత్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అంటున్నారు.

ఒక విధంగా అభిజిత్ 12వ వారం ధీమాగానే గేం ఆడినట్లుగా కనిపిస్తోంది. తనకు సాటి లేరన్న భావన కూడా ఆయనలో ఎక్కడో ఉందో ఏమో తెలియదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం అభిజిత్ లో కనిపించింది. బహుశా ఇదే బిగ్ బాస్ కూడా గమనించాడని అంటున్నారు.

ఇక బిగ్ బాస్ మీద ఉన్న ఆసక్తిని తగ్గించేలా ఈసారి ముందు నుంచే అభిజిత్ విన్నర్ అని బయట ప్రచారం కావడం కూడా నచ్చి ఉండకపోవచ్చు. దాంతో ఏకంగా అభిజిత్ కి భారీ షాకే ఇచ్చేశాడు. గేట్స్ ఓపెన్ చేసి బ్యాగ్స్ సర్దుకోమన్నంత హడావుడి చేసిన హోస్ట్ నాగార్జున చివరికి అభిజిత్ తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా చేశాడు. చూడబోతే మూడే మూడు వారాల వ్యవధి ఉంద్. మరి అభిజిత్ తన గ్రాఫ్ పెంచుకుని ఆట తీరు మార్చుకుని ముందుకు సాగుతాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: