సాధారణంగా ఇద్దరు హీరోలు ఒకే రోజు సినిమా విడుదల చేస్తుంటేనే అభిమానుల్లో తీవ్ర పోటీ ఉంటుంది. మా సినిమా హిట్ అని, మా హీరో బెస్ట్ అని ఇలా ఎవరికీ వారు తమకు నచ్చిన రీతిలో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఒకే రోజు ఇద్దరు హీరోస్ ఒకే కథతో సినిమా తీసి ఒకే రోజు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం. ఒకవేళ జరిగితే ఇది సినీ చరిత్రలోనే నిలిచిపోయే సంఘటన అవుతుంది. ఒక వైపు సినిమా ఇండస్ట్రీ మరో వైపు అభిమానులు కొట్టుకు చస్తారు. అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. అది కూడా మన టాలీవుడ్ లోనే. ఆ హీరోలు ఎవరో కాదు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి నట సింహం బాలకృష్ణ. మరి ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో చూద్దాం.

 బాలకృష్ణ ముద్దుల మావయ్య సినిమా తీసి హిట్టు కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు. ఇక అదే ఏడాది బాలకృష్ణ మరో సినిమా  అశోక చక్రవర్తి సైతం రిలీజ్ అయ్యింది. కాకపోతే  అశోక చక్రవర్తి చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల అయినా రోజే వెంకటేష్ నటించిన  ధ్రువ నక్షత్రం సినిమా విడుదల అయ్యింది. చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

అయితే మలయాళం లో మోహన్ లాల్ చేసిన చిత్రం ఆర్యన్ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అక్కడ ఎలాగూ హిట్ అయ్యింది కదా అని అశోక చక్రవర్తి సినిమా నిర్మాతలు ఆర్యన్ సినిమా హక్కులను కొని తెలుగులో బాలకృష్ణ తో రీమేక్ చేయించారు. ఈ  చిత్రం 1989 జూన్ 29న రిలీజ్ అయ్యింది. సినిమా అయితే భారీ ఫెయిల్యూర్ ని మూట గట్టుకుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆర్యన్ సినిమా కథను వెంకటేష్ ని పెట్టి తీసి ధ్రువ నక్షత్రం పేరుతో అదే రోజు విడుదల చేసారు. ఇది కావాలని చేసారా లేదా యాదృచ్చికంగా జరిగిందా అనేది తెలియదు కానీ సినిమా కథ మాత్రం ఒక్కటే, హీరోలు వేరు. అయినా కూడా ధ్రువ నక్షత్రం సినిమా మంచి అందుకుంది కానీ బాలయ్య సినిమా ఫ్లాప్ అయ్యింది.  

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలను తెలుగులో రాసిన రచయితలు పరుచూరి బ్రదర్స్ కావడం. ఇద్దరి హీరోలకు కథ ఒకేలా రాస్తున్న ఈ విషయం అటు ఆ చిత్ర యూనిట్ కి కానీ చిత్ర యూనిట్ కి కానీ చెప్పలేదు. సినిమా విడుదల అయినా తర్వాత అశోక చక్రవర్తి సినిమా యూనిట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: