తన మాటలతో ఎన్నో జీవిత సత్యాలను చెప్పే మొనగాడు త్రివిక్రం శ్రీనివాస్. ఆయన సినిమాల్లో మాటలు ఆ తరువాత కూడా సందర్భం  వస్తే చాలు జనాలు తలచుకుంటూనే ఉంటారు. ఎకడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా చాలా ముఖ్యం అన్న మాట ఒక కొటేషన్ గానే ఉంటుంది. ఇక త్రివిక్రం లో కధా మాటల రచయిత ముందుగ వెండితెరను పలకరించాడు. ఆ తరువాత ఆయనలోని డైరెక్టర్ బయటకు వచ్చాడు.

ఇప్పటి దాకా  త్రివిక్రం తీసిన సినిమాలు అచ్చంగా 11 మాత్రమే.  త్రివిక్రం మెగా ఫోన్ పట్టి 20 ఏళ్ళు అవుతుంది. అయినా ఇన్ని తక్కువ సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఆయన తాను అనుకున్న కధకు అనుకున్న హీరో కోసం వెయిట్ చేయడమే అంటారు. అంతే కాదు, కంఫర్ట్ జోన్  చూసుకుని మరీ సినిమాలు తీస్తారని పేరు.

అల త్రివిక్రం కి కంఫర్ట్ గా ఉన్న‌ హీరోలు ముగ్గురే ముగ్గురు అంటారు. ఆయన తీసిన మొత్తం 11 సినిమాల్లో ఈ ముగ్గురు హీరోల వాటా ఎనిమిది సినిమాలు అంటే ఆశ్చర్యం వేస్తుంది. త్రివిక్రం  ఇష్టపడే హీరోలో మొదటి పేరుగా పవన్ కళ్యాణ్ అని చెపాలి. జల్సాతో మొదలుపెట్టి అత్తారింటికి దారేదీ వంటి బ్లాక్ బస్టర్ హిట్  కొట్టిన తరువాత అజ్ణాతవాసి సినిమాను త్రివిక్రం చేశారు. ఇందులో మూడవది తప్ప మిగిలిన రెండూ బ్లాక్ బస్టర్లే.

ఇక ఆ తరువాత అల్లు అర్జున్ తో కూడా మూడు సినిమాలు చేశాడు త్రివిక్రం. మొదట జులాయితో మొదలు పెట్టి ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అదిరిపోయే హిట్ గా అల వైకుంఠపురంలో మూవీని తీసి చరిత్ర తిరగేశారు. అదే విధంగా మహేష్ తో అతడు వంటి డీసెంట్ హిట్ కొట్టిన త్రివిక్రం ఆ తరువాత ఖలేజా మూవీ తీశారు. ఇది ఫ్లాప్ అయినా టీవీల్లో మాత్రం సూపర్ హిట్. ఎన్టీయార్ తో అరవింద సమేత మూవీని తీసి హిట్ కొట్టిన త్రివిక్రం ఇపుడు ఆయనతో రెండవ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మాటల మాంత్రికుడి కెరీర్ లో కొందరు హీరోలు మాత్రమే కనిపించడం విశేషమే.


మరింత సమాచారం తెలుసుకోండి: