సౌందర్య ..సౌత్ ఇండియాలో వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి వందల కోట్ల ఆస్తులను కూడగట్టింది. 12 సంవత్సరాలు ఏకధాటిగా అగ్రహీరోయిన్ గా వెలుగొందింది. సినిమాల్లో క్రేజ్ తగ్గుతున్న సమయంలో 2003 లో చిన్న నాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొంది. ఏడాది కూడా తిరగకుండానే గర్భవతి అయ్యింది. బీజేపీ తరపున ప్రచారం చేయబోయి, మూడునెలల గర్భవతి గా ఉన్న సౌందర్య విమాన ప్రమాదంలో కన్ను మూసింది. తన సినిమాలు, వైవాహిక జీవితం గురించి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు అందరికి తెలిసినవే.

అమర సౌందర్య విద్యాలయ

సౌందర్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందు భర్త అన్నయ్య అమరనాథ్ తో కలిసి అమర సౌందర్య విద్యాలయ అనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. నేటికీ సౌందర్య ఆస్తుల నుండి వస్తున్న ఆదాయం ఈ ఆశ్రమానికి చేరుతూ వస్తుంది. అయితే ఆమె వందల కోట్ల ఆస్తులు ప్రస్తుతం ఎవరి చేతిలో కాకుండా కోర్ట్ పరిధిలో ఉన్నాయి. అందుకు కారణం సౌందర్య ఆస్తుల్లో ఆమె అన్నయ్య భార్య  కు వాటా వస్తుందని కేసు వేయడంతో ప్రస్తుతం ఆస్తులన్నీ కోర్ట్ పరిధిలో ఉన్నాయ్. నిజానికి సౌందర్య తో పాటు ఆమె అన్నయ్య అమరనాథ్ కూడా అదే ప్రమాదంలో చనిపోయాడు. ఆమె సినిమాలకు సంబదించిన అన్ని విషయాలను, ఆమె సంపాదించినా ఆస్తులను కూడా ఆమె అన్నయ్య అమరనాథ్ చూసుకునే వాడు. ఇక సౌందర్య, అమరనాథ్ లు ఇద్దరు ఒకేసారి కన్నుమూయడంతో సమస్య మొదలయ్యింది. సౌందర్య పోయిన తర్వాత ఉన్నఫలంగా ఒక వీలునామా రాసింది అని, అందులో కుటుంబ సభ్యులందరికి సమానంగా ఆస్తులు పంచినట్టు ఉందని సౌందర్య వదిన నిర్మల కోర్ట్ కి ఎక్కారు. కానీ సౌందర్య తల్లి మంజుల మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. నిర్మలకు ఆస్థి తో ఎలాంటి సంబంధం లేదు అని సౌందర్య భర్త రఘు తో కలిపి మంజుల కోర్ట్ కి వెళ్లారు. అందువల్ల ఆస్తులు అమ్ముకోలేక, వాటిని అనుభవించలేని పరిస్థితి కుటుంబ సభ్యులకు వచ్చింది. నేటికీ ఆస్తుల విషయం ఒక కొలిక్కి రాలేదు. ఇక ఇటీవల సౌందర్య వదిన మరోసారి కోర్ట్ లో వాజ్యం వేయడం జరిగింది. ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా కూడా తన కొడుకు స్కూల్ ఫీజ్ కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది అంటూ ఆమె కోర్ట్ కి తన వాదన వినిపించింది. నిజానికి వందల కోట్ల ఆస్తులు ఉన్న పూట గడవడం కష్టం గా మారడం, సౌందర్య కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. ఆమె ఉండి ఉంటె పరిస్థితి మరోలా ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: