సాయంత్రానికి ఎపిసోడ్ వస్తుందని తెలిసినా.. ముందు వచ్చే ప్రోమోతో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షో అసలు ఎపిసోడ్ కు ఈక్వల్ గా ప్రోమోస్ సూపర్ గా వర్క్ అవుట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆసక్తితో రోజు యూట్యూబ్ లో వేలమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ప్రోమోల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఇలా ప్రోమో పెట్టడమే ఆలస్యం అలా వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు గంటలోనే మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ స్టార్ హీరో సినిమా టీజర్ కు వచ్చిన వ్యూస్ లానే స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ బిగ్ బాస్ ప్రోమోస్ కు అదే రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి. ఇక ఆ ప్రోమోస్ కింద కామెంట్స్ లో కూడా తాము సపోర్ట్ చేసే హౌజ్ మేట్స్ గురించి కామెంట్ చేయడం.. నెగటివ్ కామెంట్స్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఈ ప్రోమో వ్యూస్ చూస్తుంటేనే తెలుస్తుంది షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది అన్నది.

హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే 9 కోట్ల పైగా ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది. అయితే షో వన్ సైడ్ అవకుండా సోషల్ మీడియా గ్రూప్స్ లో రియల్, ఫేక్ లాంటి ఓటింగ్స్ ను పరిగణలో తీసుకుని హౌజ్ మేట్స్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ టీం ఆ విషయంలో సూపర్ క్లారిటీతో ఉన్నారు. ఈరోజు సండే ఎపిసోడ్ కు సంబందిచిన ప్రోమో కూడా ఇలా వచ్చిందో లేదో అలా మిలియన్ వ్యూస్ రాబడుతుంది. బిగ్ బాస్ క్రేజ్ కు ఇది ఒక నిదర్శనమని చెప్పొచ్చు.                        



మరింత సమాచారం తెలుసుకోండి: