ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి పాపం అనవసరంగా ఆ నాగార్జున అవినాష్ ని పులిహోర రాజా అని ఎగతాళి చేసి ఆటపట్టిస్తాడు గాని హౌస్ లో అసలు సిసలు పులిహోర కలిపేది ఆ గుజరాతి మోనాల్ గజ్జర్ అని బిగ్ బాస్ లవర్స్ మండిపడుతున్నారు. ఆమె మామూలు పులిహోర కాదు గుజరాతీ పులిహోర కలుపుతుంది అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్..అసలు నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ మోనాల్  హౌస్‌లో ఉన్న అఖిల్, అభిజిత్‌లతో పులిహోర కలిపి.. వాళ్లని తన వెనుక తిప్పించుకోవడమో.. లేక ఈమె వాళ్ల వెనుక తిరుగుడం చేసింది ..ఇక బిగ్ బాస్ కి  గెస్ట్‌గా వచ్చిన సుదీప్‌ని సైతం వదల్లేదు. ‘నువ్ నాకు చాలా ఇష్టం’ అని చెప్పి తెగ సిగ్గుపడిపోయింది. బ్యాగ్రౌండ్ ఈగ సినిమా సాంగ్ ప్లే కావడంతో రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోయారు ఈ ఇద్దరూ.

మరి మోనాల్‌తో బిగ్ బాస్ అలా చెప్పమన్నారో లేక మోనాల్ తన మనసులో కోరిక బయటపెట్టిందో నేటి ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది.అయిన మోనాల్ అంత అమాయకురాలు ఏం కాదని మోనాల్ పెద్ద జిత్తుల మారి నక్క అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. హౌస్ లో ఎక్కువ గొడవలు ఆమె వల్లే జరిగాయని ఆమెని ఎలిమినేట్ చెయ్యాలని ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లతో డిమాండ్ చేస్తున్నాడు. అయిన ఈ నాగార్జున వున్నాడే ఎప్పుడు చూసిన ఆడవాళ్ళకి ఫేవర్ గా నడుచుకుంటాడు తప్ప బాగా ఆడే వాళ్ళకి సపోర్ట్ ఏమాత్రం ఇవ్వడానికి కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన మోనాల్ ని కాపాడుతూ ప్రతివారం నాగార్జున కావాలనే సేవ్ చేస్తున్నాడని నెటిజనులు నాగార్జున పై తెగ మండి పడుతున్నారు. మరి ఈ కామెంట్లకి నాగార్జున ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బిగ్ బాస్ విశేషాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: