మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. సినిమాలో చరణ్ రోల్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలపై ఇప్పటికే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆచార్య సినిమాలో చరణ్ సరిగా ఇంటర్వల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

సినిమాలో చరణ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అంటే ప్రీ క్లైమాక్స్ లో వస్తాడట. ఫస్ట్ హాఫ్ ముందు ఓ పది నిమిషాలు అరుపులు పెట్టిస్తాడట. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మరో 20 నిమిషాలు అదరగొడతారట. సినిమాలో విలన్ తో ఫైట్ చేసే క్రమంలో ఒక సీన్ చరణ్ చేస్తే అదే సీన్ రిపీట్ చేస్తూ చిరు కనిపిస్తాడని తెలుస్తుంది. కొరటాల శివ ఈ సీన్ చాలా క్రేజీగా ప్లాన్ చేశాడని తెలుస్తుంది.

సినిమాలో ఇప్పటికే చిరు పోర్షన్ దాదాపు పూర్తి అయ్యిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ కు సంబందించిన షూటింగ్ జరగాల్సి ఉంది. సినిమాలో చరణ్ రోల్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఇస్తుందని అంటున్నారు. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బిజిఎం కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు. ఇక సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వల్ హీరోయిన్ గా నటిస్తుంది. చరణ్ పక్కన ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: