మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ అంటే అంత ఈజీగా వస్తుందా చెప్పండి. అదికూడా మెగాస్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేస్తా అంటున్నాడు బిగ్ బాస్ కంటెస్టంట్ అమ్మా రాజశేఖర్. బిగ్ బాస్ సీజన్ 4లో డ్యాన్స్ మాస్టర్ కం డైరక్టర్ అమ్మా రాజశేఖర్ హౌజ్ లో 9 వారాల దాకా ఉన్నాడు. టాప్ 5లో ఉంటారని మొదట్లో అనుకున్నా ఆ తర్వాత మిగిలిన కంటెస్టంట్స్ చాలా టఫ్ ఫైట్ ఇస్తుండటం కామెడీ చేసే అమ్మా ప్రతి విషయానికి కోప్పడటం ఆడియెన్స్ ఆయన్ను బయటకు వచ్చేలా చేశాయి.

బయటకు వచ్చిన అమ్మా రాజశేఖర్ ఆల్రెడీ ఓ ప్రాజెక్ట్ ను కన్ ఫాం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రీసెంట్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని ఆయనకు గబ్బర్ సింగ్ లాంటి ఓ కథ రెడీ చేస్తున్నాని అన్నారు అమ్మా రాజశేఖర్. అదేంటి గబ్బర్ సింగ్ పవర్ స్టార్ ది కదా అమ్మా రాజశేఖర్ కు ఆమాత్రం తెలియదా అని కాదు. పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ ఎలాంటి కిక్ ఇచ్చిందో అలాంటి కిక్ ఇచ్చే సినిమా చిరుతో చేస్తానని అన్నాడని తెలుస్తుంది.

అయితే చిరుతో ఛాన్స్ అంటే అంత ఈజాగా జరిగే పని కాదు. రణంతో డైరక్టర్ గా హిట్ కొట్టిన అమ్మా రాజశేఖర్ రవితేజతో ఖతర్నాక్ అంటూ డిజాస్టర్ సినిమా చేశారు. కొన్నాళ్లుగా డైరక్షన్ కు దూరంగా ఉంటున్న అమ్మా రాజశేఖర్ బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: