సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ సినిమా ద్వారా టాలీవుడ్ కి బాలనటుడిగా పరిచయం అయ్యారు. తండ్రి కృష్ణ నటవారసుడిగా ఆ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన మహేష్, ఆ తరువాత పలు సినిమాల్లో బాలనటుడిగా పలు పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ మహేష్ టాలీవుడ్ కి పరిచయమై సక్సెస్ఫుల్ గా 41 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు సినిమా ప్రముఖులు, సూపర్ స్టార్ అభిమానులు, ప్రేక్షకులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక బాలచంద్రుడు మూవీ తరువాత కెరీర్ పరంగా గ్యాప్ తీసుకున్న మహేష్ 1999లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా మారారు.

అయితే రిలీజ్ అనంతరం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి ఫస్ట్ మూవీ తోనే మహేష్ కి మంచి బ్రేక్ ని అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలతో కొనసాగిన మహేష్, తన కెరీర్ నాలుగవ సినిమా మురారి ద్వారా ఫస్ట్ భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఏడవ సినిమాగా వచ్చిన ఒక్కడు మూవీ మహేష్ బాబు కి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందించింది. ఆపై మరింతగా దూసుకెళ్లిన మహేష్ అక్కడి నుండి వెనుతిరిగి చూసుకోలేదు. ఆపై వచ్చిన అతడు, పోకిరి, శ్రీమంతుడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు మహేష్ బాబు కి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించి కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులో ఆయనకు సుస్థిర స్థానాన్ని అందించాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా ఉన్న హీరోల్లో ఒకరిగా మహేష్ ముందుకు సాగుతున్నారు. అయితే మహేష్ బాబు నేడు ఇంతటి గొప్ప స్థాయికి చేరి తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడానికి కెరీర్ పరంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

గోల్డెన్ స్పూన్ తో పుట్టడం అనేది కేవలం మన అరంగేట్రానికి బీజం మాత్రమే అని, ఆ తరువాత నుండి ఎవరికి వారు కష్టపడితేనే ఎక్కడైనా సక్సెస్ లభిస్తుందని మహేష్ చెప్తుంటారు. ఆ విధంగా కెరీర్ పరంగా కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూసిన మహేష్, ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. ఇక మహేష్ కి కేవలం తెలుగులోనే కాక పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో, అలానే ముఖ్యముగా ఓవర్సీస్ సహా పలు ఇతర దేశాల్లో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: