ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  బిగ్ బాస్ 4 ఆదివారం ఎపిసోడ్ లో  ఒక సర్ ప్రైజ్ అంటూ ఇంటి సభ్యులు నాగార్జున క్లాస్ అండ్ మాస్ సాంగ్‌కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే డాన్స్ అంటే పారిపోయే అభిజిత్ సైతం స్టెప్పులతో అదరగొట్టాడు. మంచి జోష్‌తో స్టెప్పులు వేసి నాగార్జునతోనే శెభాష్ అనిపించుకున్నారు. నిన్న అభిజిత్‌ని టార్గెట్ చేస్తూ తిట్టిన నాగార్జునే ఈరోజు పొగడ్తల వర్షం కురిపించారు.అయితే అభిని మెచ్చుకోడానికి కారణం. నిన్న అభిని నాగార్జున టార్చెర్ చేసినందువల్ల అభి ఫ్యాన్స్ నాగార్జున ని బాగా ట్రోల్ చేసి భయపెట్టించేసారు. దాంతో భయపడిన నాగార్జున ఈరోజు అభిని మెచ్చుకున్నారు.

శనివారం ఎపిసోడ్ లో సారీ సార్ తప్పయిపోయింది.. క్షమించమని కోరుకుంటున్నా.. అంటూ అభిజిత్ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి క్షమాపణ కోరినా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కనికరించలేదు. శనివారం నాటి ఎపిసోడ్ చూశాక అభిజిత్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. అభిజిత్‌కి కావాలని టార్గెట్ చేశారని  హోస్ట్ నాగార్జునపై ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో భారీగా ట్రోల్ల్స్ చేశారు. ఈ తరుణంలో బిగ్ బాస్‌కి అలాగే హోస్ట్ నాగార్జునకి సోషల్ మీడియాలో చుక్కలు చూపించారు.డియర్ నాగార్జున  బిగ్ బాస్ గారు మీకు దమ్ముంటే అభిజిత్‌ని బయటకు తోసేయండి చూద్దాం అని సవాలు విసురుతున్నారు. ఇక నాగార్జున పై ఒక రేంజ్ లో ట్రోల్ జరుగుతుంది.ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: